విజయ్ దేవరకొండ మాస్ కం బ్యాక్!

విజయ్ లైనప్‌లో ఉన్న మూడు భారీ ప్రాజెక్టులు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా? పాన్-ఇండియా స్థాయిలో విజ‌య్ ఇమేజ్‌ను మరింత పెంచుతాయని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు.;

Update: 2026-05-10 11:30 GMT

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా? ఈసారి మాత్రం పక్కా మాస్ యాక్షన్ , విభిన్నమైన కథాంశాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధమ‌వుతున్నారు. విజయ్ లైనప్‌లో ఉన్న మూడు భారీ ప్రాజెక్టులు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా? పాన్-ఇండియా స్థాయిలో విజ‌య్ ఇమేజ్‌ను మరింత పెంచుతాయని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `రౌడీ జ‌నార్ద‌న‌`చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇందులో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా 2026 డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇందులో విజయ్ పాత రౌడీ ఇమేజ్‌కు సరికొత్త మాస్ హంగులు జోడించి జనార్ధనగా అలరించబోతున్నారు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ `రణబాలి`. `టాక్సీవాలా` వంటి హిట్ అందించిన రాహుల్ సంకృత్య‌న్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ వార్ మూవీ తెర‌కె క్కుతోంది. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` తర్వాత విజయ్ - రష్మిక మందన్నా జంట మళ్ళీ ఈ సినిమాతో అల‌రించ‌బోతున్నారు.

వలస పాలన కాలం నాటి ఇంటెన్సిటీతో సాగే యాక్షన్ ఎపిక్ సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించడంతో సినిమాకి గ్లోబ‌ల్ అప్పిరియ‌న్స్ ద‌క్కుతోంది. ఇటీవలే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ శౌర్యువ్ దర్శకత్వంలో ఉండబోతోంది. `హాయ్ నాన్న` వంటి ఎమోషనల్ హిట్‌తో మెప్పించిన సౌర్య ఈసారి విజయ్‌తో మైథ లాజికల్ టచ్ ఉన్న గ్లోబల్ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేశారు. `అంత కోపం వెనుక ఒకప్పుడు ప్రేమ ఉంది` అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ సినిమాలో విజయ్ లుక్ చాలా కొత్తగా వైల్డ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూడు చిత్రాలను గమనిస్తే విజయ్ దేవరకొండ పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు పక్కా లోకల్ మాస్ , మరోవైపు హిస్టారికల్ వార్ డ్రామా , ఇంకోవైపు గ్లోబల్ అప్పీల్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్. ఇలా ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా రష్మికతో మళ్ళీ జతకట్టడం ,కీర్తి సురేష్‌తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం వంటి అంశాలు ప్రాజెక్టులపై క్రేజ్ పెంచుతున్నాయి. విజయ్ దేవరకొండ మళ్ళీ ఫామ్‌ను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నటనకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి చిత్రంలోనూ తన బాడీ లాంగ్వేజ్‌ను, గెటప్‌ను మార్చుకుంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. ఈ మూడు చిత్రాలతో విజ‌య్ మాస్ కంబ్యాక్ ఇస్తాడ‌ని ఆయ‌న అభిమానులు అంతే కాన్పిడెంట్ తో ఉన్నారు.

Tags:    

Similar News