ఆ యాసంటే ఇష్టం.. అందుకే అట్లా మాట్లాడిన: విజయ్

జూలై 31న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. తిరుప‌తిలో ఇటీవల ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌ను శనివారం నిర్వ‌హించారు మేక‌ర్స్.;

Update: 2025-07-30 14:55 GMT

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగ‌వంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ భాగ్య‌శ్రీ బొర్సే క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. స‌త్య‌దేవ్ తోపాటు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

జూలై 31న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. తిరుప‌తిలో ఇటీవల ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌ను శనివారం నిర్వ‌హించారు మేక‌ర్స్. ఆ సమయంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. రాయ‌ల‌సీమ యాస‌లో అద‌ర‌గొట్టారు. తిరుపతి.. ఎట్లా ఉండారు అందరూ?.. బాగుండారా?.. బాగుండాలి అంద‌రం బాగుండాలంటూ విజయ్ అలరించారు.

"అరుపులు కేక‌లు వింటుంటే చాలా సంతోషంగా ఉందబ్బా.. మీ అంద‌రికి ఒక మాట చెప్పాలే.. ఏడాది నుంచి కింగ్ డమ్ గురించి ఆలోచిస్తుంటే ఒకటే అనిపిస్తాంది.. తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామిగానీ.. ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. చాలా పెద్దొన్నై పూడుస్తా సామీ.. పోయి టాప్‌ లో కూర్చుంటూ" అంటూ చెప్పుకొచ్చారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ రాయలసీమ యాస అదరగొట్టేశారని అంతా కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఆ విషయంపై మీడియాతో చిట్ చాట్ సందర్భంగా విజయ్ రెస్పాండ్ అయ్యారు. "మీ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.. తెగ ట్రెండ్ అయింది.. నెక్స్ట్ మూవీ రౌడీ జనార్ధన అదే యాస మాట్లాడనున్నారా" అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగారు.

దీంతో అప్పుడు తాను అనంతపురంలో చదివినాను అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అందుకే యాసంటే ఇష్టమని చెప్పారు. ఆ తిరుపతిలో ఉంటిమి.. అట్లా మాట్లాడిన అంతే అని తెలిపారు. ఆ తర్వాత రాయలసీమ అబ్బాయి రాహుల్ సాంకృత్యాన్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తాండా అని విజయ్ దేవరకొండ చెప్పారు.

కాగా, రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారి కాంబోలో టాక్సీవాలా మూవీ రాగా.. సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుండగా.. మంచి అంచనాలు ఉన్నాయి. హిస్టారికల్ జోనర్ లో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News