VD 14 ముహూర్తం ఫిక్స్..!
ఈ మూవీ తర్వాత దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ షూటింగ్ మొదలైందని టాక్.;
ఈ నెల 31న కింగ్ డం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ దేవరకొండ. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ షూటింగ్ మొదలైందని టాక్.
ఇదిలా ఉంటే వీడీ 14వ ప్రాజెక్ట్ గా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 10న ఉదయం 11:09 గంటలకు విజయ్ దేవరకొండ 14వ సినిమా పూజా కార్యక్రమాలు చేయనున్నారు.
పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా 1850 నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. రాహుల్ సంకృత్యన్ నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని మరీ ఈ సబ్జెక్ట్ రెడీ చేశాడు. విజయ్ దేవరకొండ రాహుల్ ఆల్రెడీ టాక్సీవాలా సినిమాతో సక్సెస్ అందుకున్నారు. మళ్లీ ఈ హిట్ కాంబో ఈసారి భారీ మూవీతో రాబోతున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది కూడా త్వరలో తెలుస్తుంది. వీడీ 14 కోసం డైరెక్టర్ రాహుల్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. కింగ్ డం తో ఈ మంత్ ఎండ్ వస్తున్న విజయ్ ఆ సినిమా నుంచి రాబోతున్న సినిమాలన్నీ కూడా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫీస్ట్ చేసుకునేలా చేస్తున్నాడట.
విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈమధ్య వరుస ఫ్లాపులు పడ్డాయి. అతని రేంజ్ కి తగిన హిట్టు కొట్టి చాలా కాలమైంది. అయినా కూడా విజయ్ తన పట్టు విడవకుండా సినిమాలు చేస్తున్నాడు. గౌతం డైరెక్షన్ లో వస్తున్న కింగ్ డమ్ తోనే మాస్ హిట్ టార్గెట్ పెట్టుకున్న వీడీ ఇక మీదట సినిమాల విషయంలో మరింత ఫోకస్ గా ఉంటున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో రౌడీ జనార్ధన్ తో పాటుగా రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ హైప్ ఏర్పడింది.