నటి పై విమర్శలు.. పెద్ద హీరో కోసం చిన్న హీరో ప్రమోషన్స్ డుమ్మా!
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్వాసిక ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంపై విజయ్ ఆంటోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సినిమా ఎంత బాగున్నా దానికి సరైన పబ్లిసిటీ లేకపోతే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఎంత కష్టమో ప్రస్తుత ట్రెండ్‌లో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రయోగాత్మక చిత్రాల నటుడు విజయ్ ఆంటోని నటించిన `నూరు సామి` విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా ఆడియన్స్‌ను రప్పించడంలో తీవ్రంగా తడబడుతోంది. సినిమాకు జరిగిన పరిమిత ప్రమోషన్స్ .. అలాగే కథనంలో ఉన్న స్లో పేస్ దీని థియేట్రికల్ రన్‌ను బాగా దెబ్బతీశాయి. దీనివల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ దిశగా సాగుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్వాసిక ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంపై విజయ్ ఆంటోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ నటి శ్వాసికపై సూటి విమర్శలు చేశారు. తమ సినిమా థియేటర్లలో రన్ అవుతున్న సమయంలో ప్రమోషన్లలో పాల్గొనకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి డాన్సులు చేస్తూ బిజీగా గడపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద హీరో సినిమా అనగానే ఎంతో ఉత్సాహంగా ఉన్న నటి.. తన సినిమా ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకు రావడం లేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
నిజానికి ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి శ్వాసిక చేసిన `ఇల్యూమినాటి` సాంగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అయ్యింది. ఇన్‌స్టాలో ఈ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ అయ్యాయి. ఒకవైపు మోహన్ లాల్ లాంటి దిగ్గజ నటుడి పక్కన శ్వాసిక చేసిన డాన్స్ మూమెంట్స్..గ్లామరస్ ప్రెజెన్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ హల్‌చల్ చేశాయి. కానీ ఈ క్రేజ్ అంతా శ్వాసికకు వ్యక్తిగతంగా ప్లస్ అయినా.. తాను నాయికగా నటించిన `నూరు సామి` సినిమాకు మాత్రం ఎలాంటి ప్రమోషనల్ మైలేజ్ ఇవ్వలేకపోయిందనేది విజయ్ ఆంటోని ప్రధాన ఆరోపణ.
విజయ్ ఆంటోని ఈ వేదికపై మాట్లాడుతూ... తన ప్రసంగంలో శ్వాసికతో పాటు మోహన్ లాల్ సార్‌పై కూడా తనకు చాలా కోపంగా ఉందంటూ కాస్త వ్యంగ్యంగా, ఆవేదనగా వ్యాఖ్యానించారు. ఒకవైపు `నూరు సామి` సినిమా థియేటర్లలో ఆడుతుంటే, శ్వాసిక మాత్రం సినిమాను ప్రమోట్ చేయడంపై దృష్టి పెట్టకుండా మోహన్ లాల్‌తో డాన్స్ చేస్తూ ఉండిపోయిందని అన్నారు. తనను ఒంటరిగా వదిలేసి.. ఆమె వెళ్లి మోహన్ లాల్‌తో ఆ పెర్ఫార్మెన్స్‌లో జాయిన్ అవ్వడం తనకు చాలా బాధ కలిగించిందని విజయ్ ఆంటోని సూటిగా చెప్పారు. సినిమా బాగున్నా ప్రమోషన్స్ లేక వెనుకబడిపోతుంటే హీరోయిన్ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదనే అర్థంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి ప్రమోట్ చేయడం ఎంతో ముఖ్యం. పెద్ద హీరోల సినిమాలకు దక్కే ప్రచారం... చిన్న లేదా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు దక్కదు కాబట్టి హీరోయిన్ల సపోర్ట్ ఇలాంటి సమయాల్లోనే చాలా అవసరమవుతుంది. విజయ్ ఆంటోని చేసిన ఈ సూటి విమర్శలు ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ లలో పెద్ద చర్చకు దారితీశాయి. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కనీసం ప్రమోషన్స్ కైనా నటీనటులు బాధ్యతగా హాజరుకావాలనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. దీనిపై నటి శ్వాసిక ఎలా స్పందిస్తుందో చూడాలి.