బ్లడీ రోమియో : కాస్త ఆలస్యం, నాని సరికొత్త అవతారం

నాని తాజాగా ‘ది ప్యారడైజ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు ఏడాదిన్నర ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

Update: 2026-10-03 18:30 GMT

నాని తాజాగా ‘ది ప్యారడైజ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు ఏడాదిన్నర ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాను కొందరు ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారన్న మాట వాస్తవం. నాని ఇలాంటి ఎత్తు పల్లాలు ఎన్నో చూశాడు. నాని సినిమాల ఫలితాలను పట్టించుకోకుండా వరుసగా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. హిట్‌ కొట్టినప్పుడు వెంటనే, ఫెయిల్‌ అయినప్పుడు కాస్త స్లోగా సినిమాలు చేయడం నాని కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు. ది ప్యారడైజ్‌ మూవీ ఫలితం ఇంకా పూర్తిగా తేలకుండానే తన తదుపరి సినిమాకు నాని రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నాని సరికొత్త లుక్‌ కోసం రెడీ అవుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నాని ది ప్యారడైజ్‌ మూవీలో...

ది ప్యారడైజ్‌ మూవీలోని జెడల్‌ పాత్ర కోసం నాని జుట్టు పెంచుకున్నాడు. సినిమా విడుదల సమయంలోనూ పెద్ద జుట్టుతోనే నాని కనిపించాడు. గడ్డం, జుట్టుతో కాస్త గంభీర్యంగా నాని కనిపించాడు. అయితే నాని తదుపరి సినిమా సుజీత్‌ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. వీరి కాంబోలో బ్లడీ రోమియో అనే సినిమా చాలా కాలం క్రితమే ప్రకటించబడింది. అది ఇప్పటికీ పట్టాలెక్కేందుకు రెడీ అయింది. ది ప్యారడైజ్ మూవీ విడుదల సమయంలో బ్లడీ రోమియో సినిమాను అక్టోబర్‌ లో షూటింగ్‌ మొదలు అయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాస్త ఆలస్యంగా సినిమాను నవంబర్‌లో ప్రారంభించాలని సుజీత్‌ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అది కూడా నాని లుక్‌ చేంజ్ కోసం అని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. నాని మొత్తం తన లుక్‌ ను మార్చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

సుజీత్ దర్శకత్వంలో నాని సినిమా...

సుజీత్‌ తన సినిమాల్లో హీరోను చాలా స్టైలిష్‌ గా చూపించడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. కనుక ఈ సినిమాలో కూడా నానిని దర్శకుడు సుజీత్‌ స్టైలిష్‌ అవతారంలో చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మద్య కాలంలో దసరా, ది ప్యారడైజ్‌ అంటూ నాని చాలా మాస్‌ లుక్‌తో కనిపించాడు. ఒకప్పుడు నాని చాలా క్యూట్‌గా, మ్యాన్లీగా కనిపించిన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే మళ్లీ నానిని అలాంటి లుక్‌లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరీ అంత హోమ్లీ, మ్యాన్లీ లుక్ కాకున్నా కచ్చితంగా సుజీత్‌ ఆధ్వర్యంలో నాని ఒక మంచి లుక్‌తో సందడి చేయడం ఖాయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా కొత్త లుక్‌ కి కేవలం నెల రోజుల గ్యాప్‌ లోనే చేంజ్ అయ్యే విధంగా నాని ప్లాన్‌ చేశాడట.

నాని బ్లడీ రోమియో సినిమాతో...

బ్లడీ రోమియో సినిమా కథ చాలా కాలం క్రితమే ఫైనల్‌ అయిందట. సుజీత్‌కి పవన్‌ కళ్యాణ్ నుంచి ఓజీ సినిమాకు దర్శకత్వం వహించేందుకు గాను పిలుపు రావడంతో నాని సినిమాను పక్కన పెట్టి వెళ్లాల్సి వచ్చింది. స్వయంగా నాని సూచన మేరకు సుజీత్‌ 'ఓజీ' సినిమాను చేసుకుని వచ్చాడట. ఓజీ సినిమా పూర్తి అయిన వెంటనే నానితో సుజీత్‌ సినిమా చేయాలి అనుకున్నా డేట్లు కుదరలేదు. నాని ది ప్యారడైజ్‌ మూవీతో బిజీగా ఉండటం, అంతకు ముందు కమిట్‌ అయిన సినిమాలు ఉండటంతో తప్పని పరిస్థితుల్లో నాని బ్లడీ రోమియో సినిమాను ఇన్నాళ్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్‌గా సినిమాకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, 2027 సమ్మర్‌ వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని గత చిత్రాల అనుభవం నేపథ్యంలో బ్లడీ రోమియోను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నాడట. 2027 లో బ్లడీ రోమియో కాకుండా మరో సినిమాతోనూ నాని వచ్చే అవకాశాలు ఉంటాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News