ఆర్సీ 17 సుకుమార్ దిమ్మ‌తిరిగే మాస్ట‌ర్ ప్లాన్!

సాధారణంగా సుకుమార్ సినిమాలంటే స్క్రిప్ట్ వర్క్, ప్రొడక్షన్ పరంగా చాలా సమయం తీసుకుంటారనే పేరుంది.

Update: 2026-10-04 03:50 GMT

`రంగస్థలం` కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ `#RC17`పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి సుకుమార్ సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సినిమాను తెరకెక్కించడమే కాకుండా పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను పూర్తి చేసి 2027 డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పక్కా డెడ్‌లైన్‌తో టీమ్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.

సాధారణంగా సుకుమార్ సినిమాలంటే స్క్రిప్ట్ వర్క్, ప్రొడక్షన్ పరంగా చాలా సమయం తీసుకుంటారనే పేరుంది. అందునా రామ్ చరణ్ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో సినిమా అంటే సాధారణంగా రెండొమూడేళ్ల పాటు షూటింగ్ దశలోనే ఉంటుందని భావిస్తారు. కానీ ఈసారి సుక్కు అండ్ టీమ్ మాత్రం రూటు మార్చారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎక్కడా బ్రేకులు పడకుండా షెడ్యూల్ ప్రకారంగా సాగేలా ముందుగానే పక్కా స్క్రిప్ట్ వర్క్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా పన్నెండు నెలల వ్యవధిలోనే షూటింగ్ పార్ట్ మొత్తం ముగించేలా కఠినమైన ప్రణాళికను అమలు చేయబోతున్నారుట‌.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ త్వరలోనే ఒకదాని తర్వాత ఒకటి వెలువడనున్నాయి. ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను ఈ నెల లోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని లేదా ఈ నెల మధ్యలో ప్రీ-లుక్ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేసి హైప్‌‌ను మరింత పెంచాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా తుది దశకు చేరుకుంటుంది. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ప్రతి విభాగానికి సంబంధించి ముందుగానే స్పష్టమైన స్పేస్ క్రియేట్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News