నాలుగో వారం లో ఎలిమినేటి అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే?
తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం, నాలుగో వారంలో సృష్టి వ్యాకరణం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదో ఎడిషన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్ ప్రారంభంలో 16 మంది కంటెస్టెంట్లతో షో మొదలు కాగా, మొదటి వారంలో ఇద్దరు ఎలిమినేట్ కావడం, అందులో ఒకరు తిరిగి రీ-ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండో వారంలో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు. మూడో వారం లో వర్షిణి, వంశీ మధ్య ఎలిమినేషన్ డేంజర్ ఉండగా, ముకేశ్ వల్ల ఎలిమినేష క్యాన్సిల్ అయింది. ఇక అదే వారం మిథిలేష్ ఇచ్చిన స్ట్రోక్ కి కంటెస్టెంట్స్ అందరికీ మైండ్ బ్లాంక్ అయింది.
మూడో వారంలో మిథిలేష్, అపూర్వ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టగా.. హౌస్‌లోకి వచ్చిన మూడో రోజే కేవలం 15 లక్షల ప్రైజ్ మనీ సూట్‌కేస్‌తో మిథిలేష్ బయటకు వెళ్లిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం, నాలుగో వారంలో సృష్టి వ్యాకరణం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
నాలుగో వారం ఎలిమినేషన్ కోసం రోహిత్ నాయుడు, త్రిగుణ్, నరేష్, అమన్, ముఖేష్ గౌడ, దేబ్జానీ, చరణ్, షాలిని మరియు సృష్టి నామినేషన్ల బరిలో నిలిచారు. ఈ ఓటింగ్ జాబితాలో చరణ్, షాలిని మరియు సృష్టిలు ఓటింగ్ ట్రెండ్స్‌లో అట్టడుగు స్థానాల్లో నిలిచారు. అయితే చరణ్ సేవ్ అవ్వగా, షాలిని సృష్టిల మధ్య లాస్ట్ రౌండ్ జరిగింది.
ముఖ్యంగా సృష్టి మొదటి వారం నుంచే ఓటింగ్‌లో వెనుకబడుతూ వస్తోంది. రెండో వారంలోనే నాగార్జున కృష్ణుడుతో పాటు సృష్టిని కూడా గట్టిగా హెచ్చరిస్తూ, ఇదే ఆట కొనసాగిస్తే ఇంటికి వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మూడో వారంలో సృష్టి కొద్దిగా హైలైట్ అయినప్పటికీ, నాలుగో వారంలో మళ్లీ చాప చుట్టేయడంతో ఆమె ఓట్లు భారీగా పడిపోయాయి.
లీకైన అప్‌డేట్ల ప్రకారం, ఓటింగ్‌లో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన సృష్టి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.