తారక్.. మళ్లీ అదే నమ్మకం..
ఇక్కడ మరో మెయిన్ ఎలిమెంట్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో భారీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఓటీటీలకు కూడా లెక్కలు మారిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేవర తర్వాత ఇప్పుడు మరోసారి తారక్ పై భారీ నమ్మకం కనిపిస్తోంది. తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ వాల్యూ సుమారు రూ.155 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
నిజానికి తారక్ కెరీర్ లో దేవరకు స్పెషల్ ప్లేస్ ఉంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఆ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో ఆ మూవీ చూసిన వారి కౌంట్ భారీగా నమోదైంది. గ్లోబల్ రేంజ్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో కూడా దేవర ట్రెండ్ అయింది. హిందీ ప్రేక్షకుల్లోనూ తారక్ కు ఉన్న క్రేజ్ ఓటీటీ ద్వారా మరోసారి కనిపించింది.
అయితే దేవరకు కంటెంట్ విషయంలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని సీన్స్, క్యారెక్టరైజేషన్ పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ విమర్శల కంటే ఓటీటీలో సినిమాకు వచ్చిన వ్యూయర్‌షిప్ నెట్ ఫ్లిక్స్ కు ముఖ్యంగా మారింది. అదే ఇప్పుడు డ్రాగన్ మూవీ విషయంలో తారక్ మార్కెట్ పై మరోసారి నమ్మకం పెట్టుకునేలా చేసిందనే చర్చ జరుగుతోంది.
ఇక్కడ మరో మెయిన్ ఎలిమెంట్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో భారీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తారక్ స్టార్ పవర్ కు ప్రశాంత్ నీల్ మార్కెట్ కూడా తోడవడంతో డ్రాగన్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
కథకు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ లొకేషన్లలో యాక్షన్ సన్నివేశాలను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బిజూ మీనన్, అశుతోష్ రాణా, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు
ఇక డ్రాగన్ విషయంలో నెట్ ఫ్లిక్స్ పెట్టిన భారీ మొత్తం వెనుక కేవలం తారక్ స్టార్ డమ్ మాత్రమే లేదు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ ఆడియన్స్ కు చేరువైన తారక్.. దేవరతో ఓటీటీలో కూడా తన క్రేజ్ చూపించారు. ఇప్పుడు అదే నమ్మకాన్ని నెట్ ఫ్లిక్స్ డ్రాగన్ పై కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే దేవరతో వచ్చిన నమ్మకం.. డ్రాగన్ కు మరింత పెద్ద డీల్ గా మారిందన్నమాట. సినిమా విడుదల తర్వాత తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఆ అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.