లోకేష్ కనకరాజు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీయడంలో వీకా..? మరి అల్లు అర్జున్ మూవీలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ పరిస్థితేంటి..?

కొంతమంది దర్శకులు మూస ధోరణిలో సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకి నచ్చినప్పటికి వాటిని రిపిటెడ్ గా చూడటానికి ఎక్కువ ఇష్టపడరు.

Update: 2026-10-03 13:30 GMT

కొంతమంది దర్శకులు మూస ధోరణిలో సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకి నచ్చినప్పటికి వాటిని రిపిటెడ్ గా చూడటానికి ఎక్కువ ఇష్టపడరు. ఇక సినిమా మీద పాషన్ తో ఉన్న దర్శకులు మాత్రం ప్రతి ఫ్రేమ్ లో తన మార్క్ కనిపించాలని సినిమాను చూసే ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందాలని కోరుకుంటాడు. దానికి తగ్గట్టుగానే కష్టపడుతూ ప్రస్తుతం వాళ్ళు చేసే సినిమాలతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేయాలని చూస్తారు. సరిగ్గా ఆ కోవకి చెందిన దర్శకుడే 'లోకేష్ కనకరాజు'... 'నగరం' సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన లోకేష్ మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. కార్తీతో చేసిన 'ఖైదీ' సినిమాను ఒక్క నైట్ లో జరిగే కథగా రాసుకొని ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా రెండున్నర గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టాడు అంటే మామూలు విషయం కాదు. లోకేష్ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. కథ విషయంలో కూడా క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతాడు. కమల్ హాసన్ లాంటి హీరోను పెట్టి 'విక్రమ్' సినిమా తీసి అతనికి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాడు. లోకేష్ కనకరాజు సినిమాలో రెట్రో సాంగ్స్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ హీరో తాలూకు ఇమేజ్ ను గుర్తు చేస్తూ ఒకప్పటి వింటేజ్ సాంగ్స్ ను తీసుకొచ్చి సినిమాలో పెడతాడు. దానివల్ల ప్రేక్షకుడికి తెలియని ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది...

ప్లాష్ బ్యాక్ చెప్పడంలో వీకా?

వరుసగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక లియో, కూలీ సినిమాలు అనుకున్న మేరకు విజయాలనైతే అందుకోలేకపోయాయి. కారణం ఏంటంటే లోకేష్ అన్ని సినిమాల్లో హీరోలకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దాన్ని కొన్ని సినిమాల్లో రివిల్ చేస్తే మరికొన్ని మూవీస్ లో దాచి పెట్టి ఉంచాడు. ఖైదీ మూవీలో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎక్కడా కూడా మనకు రివిల్ చేయడు. విక్రమ్ సినిమాలో హీరో బ్యాక్ స్టోరీ ని ఫహాద్ ఫజిల్ క్యారెక్టర్ తో ఎక్స్ప్లెయిన్ చేయిస్తాడు. దానిని యానిమేషన్ టైపులో చూపిస్తూ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ముందుకు వెళ్తారు. దానివల్ల క్యారెక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రేక్షకుడికి తెలుస్తుంది అంతే తప్ప దాన్ని విజువల్ గా సీన్స్ రూపంలో ప్రేక్షకుడికి చూపించాలనే ఉద్దేశ్యం లోకేష్ కనకరాజుకు లేదు. అలా చూపించకపోవడం కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. కానీ లియో, కూలీ సినిమాల్లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పెట్టి సినిమాలను అటు ఇటు కాకుండా చేసేసాడు. వాటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడం లో లోకేష్ తడబడ్డాడు. అందువల్లే వాటి రిజల్ట్ తేడా కొట్టింది.

కాసేపు ఇది పక్కన పెడితే ప్లాపులు ఇచ్చిన కూడా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో నటించడానికి చాలామంది హీరోలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటే టెక్నికల్ గా తనకు ఒక క్లారిటీ ఉంది. సినిమాను ఎలాంటి విజువల్స్ తో ఎలాంటి సౌండింగ్ తో ప్రేక్షకుడికి చెబితే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందనే ధోరణిలో లోకేష్ ఆలోచిస్తూ సినిమాని చేస్తుంటాడు. కాబట్టి అతనితో ఇండియాలో ఉన్న హీరోలందరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రెండు సినిమాలు వరుసగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వల్ల అనుకున్న రిజల్ట్ రాకపోవడం తో అందరు దాని గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను పెట్టి దానిని సక్సెస్ చేసి చూపించాలనే ప్రయత్నంలో లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేలా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఉందట. మరి దానిని లోకేష్ సక్సెస్ ఫుల్ గా డీల్ చేసి తన కెపాసిటి ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా? లేదంటే అనుకున్న మేరకు తీయలేక మరోసారి డీలాపోతాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ 'రాకా' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. కాబట్టి ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు...

Tags:    

Similar News