శంకర్, మురుగదాస్ ఫెయిల్యూర్స్ కి కారణం ఏంటి?

ఒకప్పుడు కొంతమంది దర్శకులు చేసే సినిమాలకి రిపీటెడ్ వాల్యు ఉండేది. వాళ్ల నుంచి సినిమాలు వస్తే చాలు ప్రేక్షకులు ఎగబడి మరి థియేటర్ కి వెళ్లి సినిమాలను చూసేవారు.

Update: 2026-10-03 15:30 GMT

ఒకప్పుడు కొంతమంది దర్శకులు చేసే సినిమాలకి రిపీటెడ్ వాల్యు ఉండేది. వాళ్ల నుంచి సినిమాలు వస్తే చాలు ప్రేక్షకులు ఎగబడి మరి థియేటర్ కి వెళ్లి సినిమాలను చూసేవారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ మొత్తాన్ని స్టార్ హీరోలు ఏలుతున్న కాలంలో కూడా కొంతమంది దర్శకులకు సపరేట్ క్రేజ్ ఉండేది... అలాంటి వాళ్ళలో శంకర్ ఒకరు. అర్జున్ తో చేసిన 'జెంటిల్ మెన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన మొదటి సినిమా తోనే సమాజంలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేసేలా సోషల్ మెసేజ్ తో సినిమాని చేశాడు. మొదటి సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవడంతో అతనికి చాలా మంచి అవకాశాలైతే వచ్చాయి. ఇక దానికి తోడుగా ఆయన టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని కాలంలోనే ప్రభుదేవా తో చేసిన 'ప్రేమికుడు' సినిమాలో 'ముక్కాల ముక్కాబుల' అనే సాంగ్ లో కాళ్ళు, చేతులు, తల లేకుండా డ్యాన్స్ చేయడాన్ని చూపించాడు. గ్రాఫిక్స్ సహాయంతో క్రియేట్ చేసిన ఆ వీడియో అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది... ఇక అప్పటివరకు సినిమా చూసే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని విధంగా 'జీన్స్' సినిమాలో 'కన్నులతో చూసేది గురువా ' సాంగ్ లో అస్థిపంజరం చేత డ్యాన్స్ చేయించాడు. అలాంటి శంకర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో లెక్క తప్పుతున్నాడు. ఆయన సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుంది. అవినీతి అన్యాయాలు అక్రమాల మీదనే అతను స్టోరీ లను రాసుకొని ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ తో సినిమాను ప్రజెంట్ చేస్తుంటాడు. అలాంటి శంకర్ కథలను ఎంచుకోవడంలోనే రాంగ్ స్టెప్ వేస్తున్నాడు... కెరియర్ స్టార్టింగ్ నుంచి రోబో సినిమా వరకు 'సుజాత రంగనాథన్ ' అనే రైటర్ ఉండడం వల్ల కథల విషయంలో శంకర్ పెద్దగా ఇబ్బంది పడలేదు. శంకర్ ఒక లైన్ చెబితే చాలు ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా సుజాత పూర్తి కథను రాసి అందులోని సీన్లను కూడా డెవలప్ చేసి ఇచ్చేవాడు.

దానివల్ల శంకర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రమే చేసుకుంటూ సినిమాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే సుజాత మరణించారో అప్పట్నుంచి శంకర్ కి కథల కష్టలైతే మొదలయ్యాయి. ఆయన చేసిన ప్రతి సినిమాలో విజువల్ గ్రాండియర్ ఉంటుంది. కానీ కథల విషయంలో ఆయన కేర్ఫుల్ గా వ్యవహరించడం లేదు. కొన్ని సినిమాల్లో లాజిక్కులు మిస్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాల్లో స్క్రీన్ ప్లే మీద కూడా ఆయన సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. ఇంకొన్ని సినిమాల్లో అయితే సీన్స్ ను కూడా ఫర్ఫెక్ట్ గా డెవలప్ చేయాలేని పరిస్థితిలో శంకర్ ఉన్నాడంటే ఆయన స్క్రిప్ట్ విషయంలో ఎంత పెద్ద మిస్టేక్స్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు... సాంగ్స్ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. ప్రతి సాంగ్ ని ప్రేక్షకుడు ఊహించని రేంజ్ లో తెరకెక్కించి వాళ్లందరి చేత క్లాప్స్ కొట్టేస్తాడు. జీన్స్ సినిమాలో అప్పటివరకు లేనివిధంగా ఒక సాంగ్ లో 7 వింతలను చూపించి ప్రేక్షకులందరి చేత వావ్ అనిపించాడు...

మురుగ దాస్

కమర్షియల్ సినిమాల్లో సోషల్ మెసేజ్ ను ఇస్తు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకులలో మురుగదాస్ ఒకరు. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మురుగుదాస్ హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్ తో సినిమాలను చేస్తాడనే వార్తలు వినిపించినప్పటికి తన ఓన్ స్టైల్ తో సౌత్ సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు. ఆయన కెరియర్ లో చేసిన గజిని, రమణ, తుపాకీ, కత్తి లాంటి మూవీస్ ఆయనను టాప్ పొజిషన్ కి తీసుకెళ్ళాయి... ప్రస్తుతం మురుగదాస్ కథల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం లేదు. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన 'స్పైడర్' మూవీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే వరెస్ట్ మూవీ గా నిలిచింది. మరి అలాంటి సినిమా తర్వాత మురుగదాస్ చేసిన మరికొన్ని సినిమాలు కూడా అతనికి ఏమాత్రం సక్సెస్ ని తీసుకొచ్చి పెట్టలేదు... ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఆలోచించడంలో మురుగదాస్ చాలా వరకు విఫలమవుతున్నాడు. కథలను రాసుకోవడంలోనే కాకుండా మేకింగ్ విషయంలో కూడా ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితైతే ఏర్పడింది...

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలను తీసుకువస్తూ ఇప్పుడున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాబట్టి శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు చాలా ఫ్రెష్ ఐడియాస్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి. అంతే తప్ప 10 సంవత్సరాల కిందటి కథలను తీసుకొని ఔట్ డేటెడ్ మేకింగ్ తో ప్రేక్షకులను విసిగించకూడదు. ఇప్పుడు ఎలాంటి కథలు నడుస్తున్నాయి. యంగ్ డైరెక్టర్లలో ఉన్నది ఏంటి మనలో లోపించిందేంటి అనేది ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకుంటే ఎవరైనా సరే ఇండస్ట్రీ లో మరోసారి వాళ్ళ సత్తా చూపించడానికి ఆస్కారం ఉంటుంది...

Tags:    

Similar News