మహేష్‌ గురించి రాజమౌళి... 200 పర్సెంట్‌!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన హీరోలను ఏ స్థాయిలో కష్టపెడుతాడో అందరికీ తెలిసిందే. ఆయన హీరోల నుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు.

Update: 2026-10-03 12:47 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన హీరోలను ఏ స్థాయిలో కష్టపెడుతాడో అందరికీ తెలిసిందే. ఆయన హీరోల నుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. దాన్ని రాబట్టుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు, ఎంత సమయం అయినా వెయిట్‌ చేస్తాడు అనే టాక్‌ ఉంది. ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి హీరోలతో ఆయన చేసిన సినిమాలు, ఆ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌, ఇతర సీన్స్‌ రాజమౌళి గొప్పతనంను, ఆయన దర్శకత్వ ప్రతిభను చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌ సరదాగా రాజమౌళిని బాబోయ్‌ నా వల్ల కాదు నీతో అంటూ తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక సీన్‌ కోసం రోజుల తరబడి ఇబ్బంది పెడుతాడని కూడా రాజమౌళితో వర్క్ చేసిన వారు అంటారు. హీరోల నుంచి ట్యాలెంట్‌ను పిండి మరీ తీసుకుంటాడని రాజమౌళికి పేరు ఉంది. అలాంటి రాజమౌళి హీరో మహేష్‌ బాబు పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజమౌళి వారణాసి సినిమాతో...

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో రాజమౌళి 'వారణాసి' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. గత ఏడాది కాలంగా సినిమా గురించి రెగ్యులర్‌గా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే రాజమౌళి నుంచి వచ్చిన అప్‌డేట్‌, ఆయన మాటలు మాత్రం చాలా చాలా స్పెషల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా గురించి, మహేష్‌ బాబు పాత్ర గురించి ఆయన మాట్లాడటమే చాలా అరుదుగా ఉంటుంది. అలాంటిది ఆయన తాజాగా ఒక చిట్‌ చాట్‌ సందర్భంగా మహేష్‌బాబు సినిమా కోసం పడుతున్న కష్టం గురించి ప్రత్యేకంగా స్పందించాడు. సినిమా కోసం ప్రిపరేషన్‌ జరిగిన సమయంలో మహేష్‌ బాబును చూసి కచ్చితంగా బాగా కష్టపడుతాడని భావించాను, కానీ షూటింగ్‌ సమయంలో ఆయన 200 పర్సెంట్‌ నేను అనుకున్న దానికి ఎక్కువ కష్టపడ్డాడు అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మహేష్‌ బాబు గురించి రాజమౌళి...

సాధారణంగా రాజమౌళి ఏ నటుడిని అంత ఈజీగా ప్రశంసించడు అని అంటారు. కానీ మహేష్ బాబును ఏకంగా తాను అనుకున్న దాని కంటే ఎక్కువ, ఏకంగా 200 పర్సంట్‌ ఎక్కువ కష్టపడ్డాడు అంటూ చెప్పడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ప్రతి దర్శకుడు తన హీరోను పొగడ్తలతో ముంచెత్తడం కామన్‌గా జరుగుతుంది. కానీ రాజమౌళి విషయంలో అలా ఎప్పుడూ జరగదు. హీరోల గురించి చాలా తక్కువగానే మాట్లాడుతాడు. తన హీరోల పాత్రల గురించి రాజమౌళి మాట్లాడుతాడు కానీ ఇతర విషయాలను గురించి అరుదుగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు మహేష్‌ బాబు యాక్టింగ్‌ గురించి మాట్లాడటం వల్ల అందరి దృష్టిని ఆకర్షించాడు. మహేష్ బాబు తన పాత్ర పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు, ఏంత కష్టపడేందుకు అయినా రెడీగా ఉంటాడని మరోసారి నిరూపితం అయిందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత...

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా కావడంతో వారణాసి పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే, వారణాసి సినిమా మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు, ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన పాన్ ఇండియా సినిమాలు తీశాడు, ఇప్పుడు వారణాసితో పాన్‌ వరల్డ్‌ మూవీని తీస్తున్నాడని కూడా టాక్‌ వినిపిస్తుంది. కేవలం ఇండియన్ భాషల్లో కాకుండా విదేశీ భాషల్లోనూ వారణాసి సినిమాను విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి రాజమౌళి కి ఫ్యాన్స్ కావాల్సిందే అని చిత్ర యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వారణాసి సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి పాన్ వరల్డ్‌ స్టార్స్‌గా మారడం ఖాయం.

Tags:    

Similar News