• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏడు ఏళ్ల తర్వాత...

ఏడు ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ కాంబో..!

| ఏడు సంవత్సరాల తర్వాత విజయ్‌, సమంత జోడీని వెండి తెరపై చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-12 11:30 GMT

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టాడు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలు చేయక పోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. విజయ్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వినోద్‌ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ముఖ్య పాత్ర కోసం సమంతను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.

విజయ్ తో గతంలో సమంత కత్తి, తేరి, మెర్సల్‌ సినిమాల్లో నటించింది. ఆ మూడు సినిమాలు సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ కాంబోగా నిలిచింది. సమంత, విజయ్‌ హ్యాట్రిక్‌ కాంబో మూవీ వచ్చి ఏడు సంవత్సరాలు అవుతోంది. వీరి కాంబోలో ఆ తర్వాత ఒకటి రెండు సార్లు సినిమాలు తీసుకు వచ్చేందుకు చర్చలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల వీరి కాంబో వర్కౌట్‌ కాలేదు. విజయ్ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్న నేపథ్యంలో వీరి కాంబో మూవీ ఇక చూడటం అసాధ్యం అని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో విజయ్‌ 69వ సినిమాలో సమంతను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏడు సంవత్సరాల తర్వాత విజయ్‌, సమంత జోడీని వెండి తెరపై చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు రెడీ అంది. అంతే కాకుండా ప్రాముఖ్యత లేని సినిమాలను పెద్ద హీరోల సినిమాలను చేయాలని అనుకోవడం లేదని కూడా సమంత చెప్పింది. దాంతో విజయ్ తో ఈ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు.. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్‌, సమంత జంటగా గతంలో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో విజయ్ చివరి సినిమాలోనూ ఆమె నటిస్తే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ తర్వాత సమంత తదుపరి ప్రాజెక్ట్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలతో పాటు సిరీస్‌లోనూ సమంత నటిస్తోంది. ఏడాది బ్రేక్ తర్వాత సమంత చాలా బిజీ బిజీగా సినిమాలు చేస్తోంది.

Tags:    
  • Kollywood 
  • Superstarvijay 
  • Tamilnadu 
  • Assemblyelections 
  • Vijaythalapathy69 
  • Samantha 
  • Citadel 
  • Webseries 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS