పవన్ - మేగా మేనల్లుడి మూవీకి టైమ్ పడుతుందా?
మూడేళ్ల విరామం తరువాత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్ సాబ్`. ఈ మూవీకి ముందు దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేకిచ్చారు పవన్. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన `వకీల్ సాబ్`తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సక్సెస్ తో మాంచి ఊపులో వున్న పవన్ ఆ వెంటనే మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కిన `భీమ్లానాయక్`లో నటించారు.
రానాతో కలిసి ఈ మూవీలో నటించారు పవన్. ఈ చిత్రం కూడా సక్సెస్ కావడంతో మరిన్ని రీమేక్ లని తెరపైకి తీసుకురావాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న `హరి హర వీరమల్లు` మూవీలో నటిస్తున్నారు పవన్ కల్యాణ్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ. దయాకర్ రావుతో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కి బ్రేకిచ్చారు.
ప్రస్తుతం ఏపీలో జరగుతున్న నాటకీయ పరిణామాలపై దృష్టిపెట్టిన పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` షూటింగ్ చేస్తూనే సైమల్ టెనియస్ గా మరో రీమేక్ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో నటుడు సముద్రఖని నటించి తెరకెక్కించిన `వినోదాయ సితం`ని తెలుగులో సముద్రఖని తో రీమేక్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీని జీ తెలుగు, పీపుల్స్ మీడియాతో కలిసి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ కూడా ఓ భాగస్వామిగా వ్యహరిస్తూ నిర్మించబోతున్నారు.
ఇందులోని కీలక పాత్రలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ మూవీని ముందు జూన్ లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా వుండటం వల్ల ఈ మూవీ షూటింగ్ ని ఆగస్టు లేదా సెప్టెంబర్ కు వాయిదా వేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం వుందని తెలిసింది.