• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సప్తగిరి రచ్చ రంబోలా

సప్తగిరి రచ్చ రంబోలా

By - Tupaki Desk
Update: 2017-11-05 04:37 GMT
కమెడియన్లు ఒక్కొక్కరుగా హీరోలైపోతున్నారు టాలీవుడ్లో. సప్తగిరి సైతం గత ఏడాది ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించాయి. నిర్మాత సేఫ్ అయ్యాడు. ఆ సినిమాను నిర్మించిన రవికిరణే ఇప్పుడు సప్తగిరి హీరోగా రెండో సినిమా కూడా తీశాడు. అదే.. సప్తగిరి ఎల్ఎల్‌బీ. ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు.

తొలి సినిమాతో పోలిస్తే రెండో సినిమాలో సప్తగిరి హీరోయిజం మరింత ఎక్కువగానే ఉండబోతోందని అర్థమవుతోంది. మాస్ హీరోలాగా డ్యాన్సులు.. ఫైట్లతో రెచ్చిపోయాడు సప్తగిరి. అతడి ఎనర్జీ చూస్తే షాకవ్వాల్సిందే. కాకపోతే సప్తగిరికి ఇవి ఏమాత్రం సూటవుతాయి.. ఇలాంటి విన్యాసాల్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహం. టీజర్లో చూపించిన ఒక కామెడీ పంచ్ రొటీన్ గానే అనిపించినా నవ్వించింది.

హీరో తన గురించి సప్తగిరి ఎల్‌ఎల్‌బీ అని పరిచయం చేసుకుంటే.. ‘‘అప్పీ అప్పీల్ బదులు యాపిల్ అని రాశావు. ప్రాసిక్యూషన్ బదులు ప్రాస్టిట్యూషన్ అని రాశావు’’ అంటూ అతడి గాలి తీసేస్తాడు సీనియర్ లాయర్. ఈ డైలాగ్ మినహాయిస్తే సప్తగిరి ఫైటింగ్.. డ్యాన్సింగ్ టాలెంట్స్ చూపించడానికే టీజర్లో మిగతా సమయమంతా కేటాయించారు. ఈ చిత్రంతో చరణ్ లక్కాకుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పరుచూరి సోదరులు ఈ చిత్రానికి రచన చేయడం విశేషం. టైటిల్ చూసి ఇది బాలీవుడ్ మూవీ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’కి రీమేకేమో అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ లేదని టీజర్ చూస్తే స్పష్టమైంది.


Full View
Tags:    
  • Sapthagiri LLB Trailer 
  • Sapthagiri LLB Movie Trailer 
  • Sapthagiri LLB Telugu Movie Trailer 
  • Sapthagiri LLB 
  • Telugu News 
  • Telugu Movie News 
  • Tollywood 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS