ఎల్లమ్మ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో డైరెక్టర్..?

బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వేణు యెల్దండి ఎల్లమ్మ అంటూ మరో పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు.;

Update: 2025-10-25 08:30 GMT

బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వేణు యెల్దండి ఎల్లమ్మ అంటూ మరో పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ తోనే వస్తుంది. అంతేకాదు ఈ సినిమా పీరియాడికల్ స్టోరీగా ఉంటుందట. ఈ సినిమా కథకు కథానాయకుడిగా రకరకాల పేర్లు వినిపించాయి. ఒక హీరోతో దాదాపు షూటింగ్ మొదలు పెట్టడమే అని అనుకోగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఏర్పడ్డాయి. ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నారు. ఈ కథను ఆయన చేయాలని ఉంది కాబట్టే ఇన్ని రోజులుగా.. ఇన్ని ట్విస్ట్ లతో కొనసాగిందని చెప్పొచ్చు.

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ..

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగానే డైరెక్టర్ వేణు సినిమాకు అజయ్ అతుల్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకుని సినిమా కోసం కొన్ని కంపోజిషన్స్ కూడా రెడీ చేయించారట. ఐతే దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తూ వేరే కంపోజర్స్ మ్యూజిక్ ఇస్తారా అన్నది కాస్త డౌట్ పడాల్సిన విషయమే. ఎందుకంటే తను హీరోగా చేసే సినిమాకు డి.ఎస్.పి తన ప్రాణం పెట్టి పాటలు ఇస్తాడు. ఎందుకంటే ఈ పాటలు.. ఈ సినిమా తన కెరీర్ లో చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి కాబట్టి.

అందుకే అజయ్ అతుల్ తో మాట్లాడి.. వాళ్లని తప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. ఎలాగు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అది అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఐతే దేవి శ్రీ ప్రసాద్ వచ్చాడు కాబట్టే ఈ మ్యూజిక్ మార్పులు జరుగుతున్నాయి. అతను కాకుండా వేరే హీరో ఎవరు చేసినా అజయ్ అతుల్ లనే కంపోజర్స్ గా కొనసాగించే వారు. ఐతే ఈ విషయాలన్నీ డైరెక్టర్ వేణుకి కాస్త హెడేక్ గా మారినట్టుగానే ఉన్నాయి.

దిల్ రాజు ఈసారి బడ్జెట్ కూడా..

ఐతే సినిమా పై ఇంపాక్ట్ పడకుండా తను చేయాల్సిన పని త్వరగా మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు వేణు. బలగం తర్వాత తనపై పూర్తి నమ్మకంతో దిల్ రాజు ఈసారి బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నాడట. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్నాడు కాబట్టి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఎల్లమ్మ సినిమాలో టైటిల్ రోల్ లో మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. సినిమాలో ఆమెకు చాలా స్కోప్ ఉన్న రోల్ దొరికిందని.. సినిమా తప్పకుండా మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని తెలుస్తుంది.

Tags:    

Similar News