'విశ్వనాథ్ అండ్ సన్స్' సీక్రెట్ బయటపెట్టిన వెంకీ అట్లూరి.. ఇదెక్కడి గోల మావా!
అయితే ఈ ప్రాజెక్ట్ మొదట అనుకున్నది కాదని, అనుకోకుండా ఈ కాంబినేషన్ కుదిరిందని దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వెర్సటైల్ నటుడు సూర్య, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదట అనుకున్నది కాదని, అనుకోకుండా ఈ కాంబినేషన్ కుదిరిందని దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కథలో వచ్చిన మార్పులు, ఈ సినిమా ఎలా మొదలైందో తెలుసుకుందాం.
బయోపిక్ అనుకుంటే.. బ్రిజీ ఫ్యామిలీ డ్రామా అయింది:
వెంకీ అట్లూరి మొదట సూర్య దగ్గరకు ఒక పవర్‌ఫుల్ బయోపిక్ స్క్రిప్ట్‌తో వెళ్లారట. కథ బాగుండటం తో సూర్య ఓకే చేసారు. కానీ కొన్ని లీగల్ రైట్స్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. సరిగ్గా అదే సమయంలో సూర్య వరుసగా రెండు బయోపిక్‌లు చేసి ఉండటంతో, "నాకు ఇప్పటికే బయోపిక్స్ సరిపోయాయి.. రైట్స్ కూడా క్లియర్ అవ్వట్లేదంటే ఇంకో ప్రాజెక్ట్ చేద్దామా? నీ దగ్గర ఏదైనా కూల్, ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ స్టోరీ ఉందా?" అని వెంకీని అడిగారట. దాంతో కథ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది.
40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల కుర్రాడికి మధ్య అరుదైన అనుబంధం:
సూర్య అడిగిన వెంటనే వెంకీ అట్లూరి ఒక డిఫరెంట్ లైన్ వినిపించారు. సాధారణంగా మనం చూసే రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లా కాకుండా, 40 ఏళ్ల ఒక వ్యక్తికి, 20 ఏళ్ల యువకుడికి మధ్య ఉండే ఒక ప్రత్యేకమైన అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.ఈ పాయింట్ సూర్యకు చాలా నచ్చి వెంటనే ఓకే చెప్పారు. అంత వేగంగా ప్రాజెక్ట్ సెట్ అవ్వడం చూసి డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా షాక్ అయ్యారట.
డార్క్ రోల్స్ నుంచి ఫన్-ఫిల్డ్ సూర్య రీ-ఎంట్రీ:
ఇటీవలి కాలంలో సూర్య ఎక్కువ భాగం యాక్షన్, డార్క్ లేదా సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చారు. రక్త చరిత్ర 2, సూరరై పోట్రు, జై భీమ్, కరుప్ప లాంటి సినిమాల్లో సీరియస్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించిన సూర్యను, చాలా కాలం తర్వాత ఒక ఫన్, ఎమోషన్స్ నిండిన బ్రిజీ ఫ్యామిలీ డ్రామాలో చూడటం అభిమానులకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇక సూర్య మార్క్ కామెడీ, ఎమోషన్స్‌ను మళ్లీ వెండితెరపై చూడటానికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఆగస్టు 14న థియేటర్లలో సందడి:
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. వెంకీ అట్లూరి మార్క్ క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్, సూర్య నటన తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. రొటీన్ డ్రామాలకు భిన్నంగా వస్తున్న ఈ 40-20 ఏళ్ల ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించడం ఖాయం.