• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కథ చెబితే KGF...

కథ చెబితే KGF అంటున్నారు.. అవేవి పట్టించుకోను..!

| నాని అంటే సుందరానికీ, ఉస్తాద్ సినిమాల్లో నటించిన వెంకటేష్ మహా లేటెస్ట్ గా సంపూర్ణేష్ బాబు నటించిన మార్టీన్ లూథర్ కింగ్ సినిమాలో నటించారు

By - Tupaki Desk
Update: 2023-10-27 07:58 GMT

యువ దర్శకులలో ప్రతిభ కలిగిన వారిలో వెంకటేష్ మహా ఒకరు. ఆయన మొదటి సినిమా కేరాఫ్ కంచెరపాలెం సినిమా సూపర్ సక్సెస్ అవగా దర్శకుడిగా అతనికి మంచి గుర్తింపు ఇచ్చింది. 2018 లో కంచెరపాలెం తీసిన వెంకటేష్ మహా రెండేళ్ల గ్యాప్ తర్వాత ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అంటూ మలయాళ సినిమా రీమేక్ చేశాడు. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. డైరెక్టర్ గా సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్న వెంకటేష్ మహా ఈమధ్య నటుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు.

నాని అంటే సుందరానికీ, ఉస్తాద్ సినిమాల్లో నటించిన వెంకటేష్ మహా లేటెస్ట్ గా సంపూర్ణేష్ బాబు నటించిన మార్టీన్ లూథర్ కింగ్ సినిమాలో నటించారు. ఈ సినిమాకు క్రియేటివ్ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వెంకటేష్ మహా. ఈ క్రమంలో తన సినిమాల గ్యాప్ గురించి ఇంటర్వ్యూయర్ అడగ్గా.. హీరోలకు కథలు చెబుతూనే ఉన్నానని కానీ వాళ్లు పుష్ప లాంటి సినిమా కావాలి. కె.జి.ఎఫ్ లాంటి కథ కావాలని అడుగుతున్నారని అన్నారు.

వెంకటేష్ మహా నుంచి ఒరిజినల్ స్టోరీస్ ఆడియన్స్ కోరుతున్నారని. ఆయన రీమేక్ లు చేయకుండా సొంత కథలతో సినిమాలు చేయాలని ఇంటర్వ్యూయర్ అడిగితే. తను ఒక లవ్ స్టోరీ ఒక నటుడికి చెప్పానని. మరో కథ చెబితే దాన్ని పుష్ప లా తీయాలని అన్నారని చెప్పారు. ఇక ఒక హీరో తన బృందానికి ఒక యాక్షన్ కథ చెబితే దీన్ని KGF లా తీయాలని అన్నారని చెప్పారు వెంకటేష్ మహా. తన కథలను మరోలా చెప్పాలని తనకు లేదని వాళ్లకు KGF లే కావాలంటే ఆ సినిమాలో హీరో ఫేస్ బదులుగా ఏఐ తో వాళ్ల ఫేస్ ని పెట్టుకోవచ్చని అన్నారు.

ఇదివరకు తను KGF సినిమా మీద చేసిన కామెంట్స్ కామన్ ఆడియన్స్ కు రీచ్ అయ్యాయని. కేవలం ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం వాడే వాళ్లు తన కామెంట్స్ గురించి స్పందించారని. వాళ్లని తాను అసలు పట్టించుకోనని అన్నారు వెంకటేష్ మహా. మార్టీన్ లూథర్ కింగ్ ప్రమోషన్స్ కోసం దాదాపు 1200 మంది కలిస్తే 1000 మందికి ఆ ఇష్యూ తెలియదని. నాకు తెలిసిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కూడా ఆ టైం లో తనకు సపోర్ట్ చేశారని అన్నారు వెంకటేష్ మహా. తన నెక్స్ట్ సినిమా మర్మాణువు చేస్తున్నానని. ఇక మీదట వరుస సినిమాలు చేస్తానని అన్నారు వెంకటేష్ మహా.

Tags:    
  • Venkateshmaha 
  • Filmindustry 
  • KGFmovie 
  • Pushpamovie 
  • Sampoorneshbabu 
  • Martinlutherking 
  • Tollywood 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS