• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆయ‌న‌తో అదిరిపోయే సినిమా...

ఆయ‌న‌తో అదిరిపోయే సినిమా చేస్తా

| ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ‌ల్టీస్టారర్ల ట్రెండ్ న‌డుస్తోంది. ఏదైనా సినిమా గురించి ఆడియ‌న్స్ మాట్లాడుకోవాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి.

By - Tupaki Desk
Update: 2025-05-12 08:30 GMT

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ‌ల్టీస్టారర్ల ట్రెండ్ న‌డుస్తోంది. ఏదైనా సినిమా గురించి ఆడియ‌న్స్ మాట్లాడుకోవాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి. అలాంటిది ఇండ‌స్ట్రీలో ఏదైనా మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తుందంటే దానికి అన్నింటికంటే ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కు కాస్త మంచి కంటెంట్ తోడైతే ఆ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించడం ఖాయం.

అల‌నాటి కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ క‌లిసి దేవుడు చేసిన మ‌నుషులు చేశారు. ఆ త‌ర్వాత కృష్ణ‌- శోభ‌న్ బాబు క‌లిసి ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్ లో వ‌చ్చిన స్టార్లు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు కాస్త త‌క్కువే చేశారు. 2013లో వెంక‌టేష్ సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాను మ‌హేష్ బాబుతో క‌లిసి చేసి ఈ మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ ను మొద‌లుపెట్టాడు.

ఆ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న వెంకీ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి గోపాల గోపాల చేశాడు. ఆ త‌ర్వాత కూడా వెంకీ ప‌లువురితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేశాడు. ఇప్పుడు త్వ‌ర‌లో వెంకీ ఓ యంగ్ హీరోతో క‌లిసి సినిమా చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. రీసెంట్ గా సింగిల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు వెంక‌టేష్ కు వీరాభిమాని అనే విష‌యం తెలిసిందే.

సింగిల్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో శ్రీ విష్ణు ఓ ఇంట‌ర్వ్యూలో వెంకీతో తాను త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని చెప్పాడు. రామ్ అబ్బ‌రాజు మైత్రీ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయ‌డానికి క‌థ‌ను రెడీ చేస్తున్నాడ‌ని, ఫ‌స్టాఫ్ ఆల్రెడీ అయిపోయింద‌ని, క‌థ పూర్త‌య్యాక ఆయ‌న్ని అప్రోచ్ అవుతామ‌ని, ఆయ‌న‌కు క‌థ చెప్తే త‌ప్ప‌కుండా సినిమా చేస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని, అన్నీ కుదిరితే ఆ సినిమాను వెంకీతో చేస్తాన‌ని, ఒక‌వేళ ఆ సినిమా కాక‌పోయినా మ‌రో సినిమా అయినా చేస్తాన‌ని, ఒక ఫ్యాన్ గా ఆయ‌న్ని ఎలా చూడాలో త‌న‌కు బాగా తెలుసని, త‌మ కాంబోలో వ‌చ్చే సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని శ్రీవిష్ణు వెల్ల‌డించాడు.

Tags:    
  • Venkatesh 
  • SreeVishnu 
  • TollywoodMultistarrer 
  • TeluguCinema 
  • VenkateshFans 
  • SreeVishnuMovies 
  • RamAbbaraju 
  • MythriMovieMakers 
  • MultistarrerTrend 
  • TeluguFilmNews 
  • TollywoodUpdates 
  • FanMoment 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS