సీనియర్ల హీరోల రచ్చకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
ఆల్రెడీ త్రివిక్రమ్ తో సినిమాను స్టార్ట్ చేసిన వెంకటేష్, ఆ సినిమాతో పాటూ మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.;
ఈ ఇయర్ పండక్కి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా వెంకటేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం భారీ హిట్ అయిన నేపథ్యంలో మంచి జోష్ లో ఉన్నారు వెంకీ. ఆ సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని డిసైడ్ అయిన వెంకీ, తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
కీలక పాత్రలో వెంకటేష్
ఆల్రెడీ త్రివిక్రమ్ తో సినిమాను స్టార్ట్ చేసిన వెంకటేష్, ఆ సినిమాతో పాటూ మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఆ సినిమాలో వెంకీ హీరో కాదు, అలాగని గెస్ట్ రోల్ కూడా కాదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి.
చిరూతో జాయిన్ అయిన వెంకీ
మన శంకరవరప్రసాద్ గారు మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మధ్యలో దీపావళి సందర్భంగా కొంత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు దీపావళి తర్వాత తిరిగి షూటింగ్ మొదలవగా, ఇవాళ(అక్టోబర్ 21) వెంకీ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. సినిమాలోని వెంకటేష్ కు సంబంధించిన సీన్స్ మరియు ఓ సాంగ్ ను కూడా ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారట డైరెక్టర్ అనిల్.
చిరూ, వెంకీ కలిసి మొదటిసారి..
కాగా మన శంకరవరప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ క్యారెక్టర్ సినిమా సెకండాఫ్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి డిజైన్ చేసిన క్యారెక్టర్ నచ్చడంతో వెంకటేష్ వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోగా, ఈ పాత్ర చేసినందుకు వెంకటేష్ కు సాలిడ్ రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు. చిరూ, వెంకీ కలిసి మొదటిసారి ఓ సినిమాలో నటిస్తుండటం, దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. మామూలుగానే అనిల్ రావిపూడి సినిమా అంటే థియేటర్లలో ఆడియన్స్ రచ్చ చేయడం ఖాయం. అలాంటిది ఇప్పుడు చిరూ, వెంకీ కలిసి ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఆడియన్స్ రచ్చను తట్టుకోవడం కష్టమేనని చెప్పొచ్చు. చిరూ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.