• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  VD 14: గుడ్ న్యూస్...

VD 14: గుడ్ న్యూస్ ఏమిటంటే..

| వీడీ 14 సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయడానికి ఆడిషన్లు తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో నిర్వహించనున్నారు

By - Tupaki Desk
Update: 2024-06-25 13:08 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'వీడీ 14' తో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే మ్ అయితే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ కాల్ ప్రకటించారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

వీడీ 14 సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయడానికి ఆడిషన్లు తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆడిషన్లు జరుగుతాయి. నటనలో ప్రతిభగల ఔత్సాహిక నటులకు ఇది ఒక అద్భుత అవకాశం.

రాయలసీమ ప్రాంతంలో 19వ శతాబ్దం నాటికి చెందిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడుతోంది. 1854 నుండి 1978 వరకు జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా ప్రేక్షకులను ఒక ఎపిక్ వరల్డ్ లోకి తీసుకెళ్ళనుంది.

'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి చిత్రాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మరియు విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇదే. విజయ్ దేవరకొండ మరియు రాహుల్ సంకృత్యన్ 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి కలసి పనిచేస్తున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాస్టింగ్ కాల్ ప్రకటనతో, కొత్త టాలెంట్‌కి ఈ సినిమా ఒక మంచి అవకాశం అవుతుంది. నటనలో ఆసక్తి ఉన్నవారు ఈ ఆడిషన్లలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు. ఇక వీడీ 14 సినిమా రాయలసీమలోనే ఎక్కువ భాగం షూట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులు, టెక్నీషియన్లు కలిసి పని చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనున్నారని ఆశిస్తున్నారు. ఇక సినిమా పూర్తి వివరాలు మరియు ఇతర అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట.

Tags:    
  • VD14castingcall 
  • Rayalaseemaartists 
  • VD14movie 
  • Tollywood 
  • Vijaydeverakonda 
  • Rahulsankrityan 
  • VD14 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS