• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలాంటి 'ఆపరేషన్' హిట్...

ఇలాంటి 'ఆపరేషన్' హిట్ అయితేనే...!

| ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్ధంగా ఉంటారు

By - Tupaki Desk
Update: 2024-02-26 04:31 GMT

ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్ధంగా ఉంటారు. కానీ వాటిని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రయోగాత్మక సినిమాలను భారీ బడ్జెట్‌ తో రూపొందించాలి అంటే ఎంతటి నిర్మాతకు అయినా, దర్శకుడికి అయినా కాస్త భయమే.

కొందరు మాత్రం సినిమాలపై ఉన్న ఆసక్తి తో ప్రయోగాలతో ముందుకు వస్తూ ఉంటారు. తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్ ప్రయోగాత్మక మూవీ 'ఆపరేషన్‌ వాలంటైన్‌' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆపరేషన్‌ వాలంటైన్‌ పై చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఎయిర్‌ పైలట్స్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించాడు. దాదాపు ఏడాది కాలం పాటు ఫిజికల్ గా మరియు మెంటల్ గా కూడా వరుణ్‌ ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాడు అంటూ ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.

తాజాగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ సినిమా కోసం చాలా కష్ట పడినట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మంచి కంటెంట్‌ ఉన్న మూవీ.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా విభిన్నమైన సినిమాగా రూపొందించడం వల్ల ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు హిట్ ఇస్తే ముందు ముందు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు మరిన్ని వస్తాయి.

వరుణ్ తేజ్ ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎంతగా కష్టపడ్డాడో అంతకు మించి ప్రమోషన్ సమయంలో కూడా కష్టపడుతూ ఉన్నాడు. ముంబై తో పాటు హైదరాబాద్‌ లో పదుల కొద్ది ఇంటర్వ్యూలు ఇస్తూ గత నెల రోజులుగా బిజీ బిజీగా ఉన్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించారు.

Tags:    
  • Varuntej 
  • Operationvalentine 
  • Manushi 
  • Chiranjeevi 
  • Filmindustry 
  • Operationvalentinemovie 
  • Shaktipratapsingh 
  • Prereleaseevent 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS