వరుణ్- లావణ్య.. ఒంటరి దీవిలో వెకేషన్
ఇటీవల ముగిసిన యాత్ర నుంచి తాజాగా మరో కొత్త ఫోటోని ఈ జంట షేర్ చేయగా అది వైరల్ గా మారింది.;
తమ మొదటి బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వరుణ్ తేజ్ కొణిదెల - లావణ్య త్రిపాఠి ఇటీవల అరుదైన ఎగ్జోటిక్ బీచ్ వెకేషన్స్ నుంచి రేర్ క్లిక్స్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీల్లా వరుణ్ - లావణ్య జంట నుంచి ఎలాంటి దాపరికాల్లేవ్. ప్రతిదీ బహిరంగమే. ఇటీవలే మాల్దీవ్స్ వెకేషన్ ముగించి హైదరాబాద్ విమానాశ్రయంలో కలిసి కనిపించారు.
2025 మే మొదటి వారంలో సోషల్ మీడియాలో ఈ జంట తమ గర్భధారణను ప్రకటించారు. ఆ తర్వాత లావణ్య - వరుణ్ జంట విహారయాత్రకు వెళుతున్నప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. విమాన ప్రయాణాలు, స్థానికంగా కార్లలో ప్రయాణాలు అన్నిటికీ సౌకర్యవంతమైన సాధారణ దుస్తులను ఎంచుకుంది మెగా కోడలు. పుట్టబోయే బేబీకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వదులుగా, భారీ పరిమాణంలో ఉన్న దుస్తులను ధరిస్తోంది.
ఇటీవల ముగిసిన యాత్ర నుంచి తాజాగా మరో కొత్త ఫోటోని ఈ జంట షేర్ చేయగా అది వైరల్ గా మారింది. బీచ్‌లో ఇది రేర్ క్లిక్. వరుణ్ - లావణ్య జంట బీచ్ ఇసుకలోని ఒక కొబ్బరి చెట్టును ఆనుకుని ఒకరికొకరు చేరువగా, ఒకరి కళ్లలోకి ఒకరు మమేకంగా చూసుకుంటూ మైమరిచిపోతున్న ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో క్షణాల్లో వైరల్ గా మారింది. నేపథ్యంలో బులుగు జిలుగు సముద్రం, వెండి మబ్బులు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇది అందమైన జంట... ఆ ఇద్దరి నడుమా ప్రేమానురాగాలు అనిర్వచనీయమైనవి! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
నవంబర్ 2023లో ఇటలీ టస్కానీలో జరిగిన అందమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వరుణ్ -లావణ్య జంట వివాహం చేసుకున్నారు. ఈ వేడుక కొద్ది మంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తూ ఆనందంగా విహారయాత్రలను ఆస్వాధిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, వరుణ్ చివరిగా మట్కా అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించాడు. కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాపులర్ మట్కా జూదగాడు రతన్ ఖేత్రి జీవితం నుండి ప్రేరణ పొంది రూపొందించిన చిత్రమిది. తదుపరి ఇండో కొరియన్ హర్రర్ కామెడీలో వరుణ్ నటిస్తాడు. ఈ చిత్రానికి #VT15 అని తాత్కాలికంగా టైటిల్ ని నిర్ణయించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య ఇటీవల వెబ్ సిరీస్ `మిసెస్ పర్ఫెక్ట్`లో కనిపించింది. అలాగే మరి కొన్ని ప్రాజెక్టుల్లో నటించాల్సి ఉంది. దుర్గా దేవి పిక్చర్స్ , ట్రియో స్టూడియోస్ పతాకంపై టి రాజేష్ - ఎం నాగ మోహన్ బాబు నిర్మిస్తున్న `సతీ లీలావతి` చిత్రం సహా `తనల్` అనే చిత్రంలోను నటించనుంది.