మెగా ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ ఎవరొస్తారో?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంట ఆదర్శ ప్రేమ వివాహం ఎప్పుడూ అభిమానులను ఎగ్జయిట్ చేస్తూనే ఉంటుంది.;
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంట ఆదర్శ ప్రేమ వివాహం ఎప్పుడూ అభిమానులను ఎగ్జయిట్ చేస్తూనే ఉంటుంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2023లో పెద్దల్ని ఒప్పించి పెళ్లాడారు. మెగా కుటుంబ ఆశీస్సులతో వరుణ్ ఓ ఇంటి వాడయ్యాడు. పెళ్లి తర్వాత లావణ్య పూర్తిగా వ్యక్తిగత కుటుంబ జీవనానికే ప్రాధాన్యతనిస్తూ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. త్వరలో విడుదలకు రానున్న ఫ్యామిలీ డ్రామా `సతీ లీలావతి` ప్రచారం మినహా ఇతర ప్రాజెక్టులకు సైన్ చేయలేదు.
వరుణ్- లావణ్య త్రిపాఠి జంట మొదటి బిడ్డకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఈ ఏడాది మేలో సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 6 మే 2025న ఇన్‌స్టాగ్రామ్ లో లావణ్య గర్భధారణను ధృవీకరించారు. తల్లిదండ్రులుగా కొత్త పాత్రను పోషించబోతున్నామనే ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. 1 నవంబర్ 2023న ఇటలీలో వివాహం చేసుకున్న ఈ జంట తమ అభిమానులకు కపుల్ గోల్స్ ని ఫిక్స్ చేస్తూ, నిరంతరం టచ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈరోజు వినాయక చవితి పండుగను లావణ్య కొణిదెల త్రిపాఠి- వరుణ్ తేజ్ జంట హైదరాబాద్ లోని స్వగృహంలో జరుపుకున్నారు. ఈ వేడుక నుంచి కొన్ని ఫోటోలను ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేయగా, లావణ్య త్రిపాఠి బేబి బంప్ ప్రధానంగా ఎక్స్ పోజ్ అవ్వడాన్ని అభిమానులు సంగ్రహించారు. వరుణ్ నేలపై కూచుని ఉండగా, లావణ్య సౌకర్యంగా ఒక వుడెన్ కుర్చీలో కూచుని వినాయకుని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోలను అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. రాబోయేది మెగా ప్రిన్స్ లేదా మెగా ప్రిన్సెస్? అంటూ ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠిని ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి ఇంకా లావణ్య, వరుణ్ దంపతులు సమాధానం ఇవ్వాల్సి ఉంది. వరుణ్ తేజ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే, అతడు మట్కా తర్వాత కెరీర్ 15వ సినిమాపై వందశాతం ఫోకస్ చేసాడు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ జానర్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.