'వారణాసి' టీజర్‌తో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది!
ఇండియన్ మూవీస్‌ని పారిస్‌లో రిలీజ్ చేసే సంస్థ ఆన్నా ఫిలింస్ వారు ఈ వార్తని కన్ఫర్మ్ చేశారు. భారీ స్క్రీన్‌పై అత్యున్నతమైన సాంకేతికతతో టీజర్‌ను ప్రదర్శించనుండటంతో వారణాసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.;
జక్కన్న అత్యంత భారీ స్థాయిలో నభూతో నభవిష్యతి అనే విధంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ `వారణాసి`. సూపర్ స్టార్ మహేష్‌బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ రివీల్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో మహేష్ రుద్రగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ కోసం మహేష్ భారతీయ ప్రాచీన యుద్ధ కళ అయినటువంటి కలరిపయట్టు నేర్చుకున్నారు. ఇందు కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దీంతో మహేష్ క్యారెక్టర్‌పై సర్వత్రా చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడటం, వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని చూపించడంతో `వారణాసి` టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీని దాదాపు రూ.1300 కోట్లు భారీ బడ్జెట్‌తో తెరైకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణదశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమా వరల్డ్‌ని పరిచయం చేయడం, అబ్బుర పరిచే సన్నివేశాలు, త్వాపర యుగానికి, కలియుగానికి లింక్ చేస్తూ చూపించిన టీజర్ సినీ లవర్స్‌ని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. వారణాసి, ఆస్టరాయిడ్ శాంభవి, రోస్ ఐస్ షెల్ఫ్...అంబొసెల్లి వైల్డర్‌నెస్, వనాంచల్ ఉగ్రభట్టి గుహ..త్రేతాయుగం నాటి లంకా నగరం...వారణాసి మణికర్ణిక ఘాట్ వంటి కీలక ప్రదేశాలని లింకప్ చేస్తూ కథని నడిపిస్తున్న తీరు సినీ లవర్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఈ వీడియోతో హాట్ టాపిక్‌గా మారిన వారణాసి టీజర్ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ మూవీ టీజర్‌ని పారిస్‌లోని లే గ్రాండ్ లెక్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తియినట్టుగా తెలిసింది. ఇలా లే గ్రాండ్ లెక్స్‌లో ప్రదర్శితం అవుతున్న తొలి భారతీయ మూవీ టీజర్‌గా `వారణాసి` టీజర్ చరిత్ర సృష్టించబోతోంది. జనవరి 5న రాత్రి 9 గంటలకు లే గ్రాండ్ లెక్స్ లో ప్రదర్శించబోతున్నారు.
ఇండియన్ మూవీస్‌ని పారిస్‌లో రిలీజ్ చేసే సంస్థ ఆన్నా ఫిలింస్ వారు ఈ వార్తని కన్ఫర్మ్ చేశారు. భారీ స్క్రీన్‌పై అత్యున్నతమైన సాంకేతికతతో టీజర్‌ను ప్రదర్శించనుండటంతో వారణాసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. `ఆర్ ఆర్ ఆర్`ని ప్రపంచ సినీ దిగ్గజాల దృష్టికి తీసుకురావడం కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేసి వారి వద్దకు చేర్చడమే కాకుండా అసాధ్యం అనుకున్న ఆస్కార్ పురస్కారాన్ని కూడా దక్కించుకుని సుసాధ్యం అనిపించాడు. ఈ నేపథ్యంలో వారణాసి` కోసం కూడా ఇదే తరహాలో ప్లాన్ లు చేస్తూ నిర్మాణ దశలోనే ప్రపంప దిగ్గజాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
2027, మార్చిలో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ మరో ఎనిమిది నెలలు బ్యాలెన్స్ ఉంది. పక్కా ప్రణాళికతో ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఊహించని విధంగా వరల్డ్ సినీ లవర్స్‌ని సంబ్రమాశ్చర్యాలకు లోను చేయాలనే ప్లాన్‌తో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈమూవీకి కీరవాణి మ్యూజిక్ చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్‌ని శ్రీనివాస్ మోహన్ సమకూరుస్తున్నారు. పృథ్దీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమూవీ ఇండియన్ సినీ హిస్టరీని ఎలా రీ క్రియేట్ చేస్తుందో చూడాలి.