వంశీ పైడిపల్లి ఇంకా ఎన్నాళ్లు..?

సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా తీసిన వంశీ పైడిపల్లి ఆ తర్వాత 4 ఏళ్లకు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో వారిసు సినిమా చేశాడు.;

Update: 2025-11-28 13:30 GMT

సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా తీసిన వంశీ పైడిపల్లి ఆ తర్వాత 4 ఏళ్లకు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో వారిసు సినిమా చేశాడు. అదొచ్చి కూడా రెండేళ్లు అవుతుంది. 2023 సంక్రాంతికి వారిసు వచ్చింది. తమిళ్ లో విజయ్ ఫ్యాన్స్ ని అలరించిన ఈ సినిమా తెలుగులో పెద్దగా మెప్పించలేదు. తన సినిమా సినిమాకు ఎలా లేదన్నా మూడు నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవడం వంశీ పైడిపల్లికి అలవాటే. కావాలని టైం తీసుకుంటాడా లేదా తను రాసుకున్న కథకు అలా టైం తీసుకుంటేనే పని అవుతుందని అనుకుంటాడా అన్నది తెలియదు కానీ 2007 నుంచి 2025 వరకు ఆయన 18 ఏళ్ల కెరీర్ లో 6 సినిమాలు మాత్రమే చేశాడు.

స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో వంశీ పైడిపల్లి..

అయినా కూడా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో వంశీ పైడిపల్లి కొనసాగుతున్నారు. వారిసు తర్వాత బాలీవుడ్ స్టార్ తో వంశీ పైడిపల్లి సినిమా అంటూ వార్తలు వచ్చాయి. వాటి గురించి కూడా తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. వంశీ పైడిపల్లి ఇంకా ఎంత టైప్ తీసుకుంటారు.. ఆయన సినిమా కోసం ఇన్నా ఎన్నాళ్లు ఎదురుచూడాలి అనుకుంటున్నారు ఆడియన్స్.

మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి బృందావనంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎవడు సినిమాతో పర్వాలేదు అనిపించుకోగా నాగార్జున, కార్తితో ఊపిరి తీసి సక్సెస్ అందుకున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కి మహర్షి లాంటి హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో వంశీ సినిమా..

ఈమధ్య సినిమాలు చేయడం కన్నా ప్రతి సినిమా ప్రీమియర్స్ తో పాటు ఈవెంట్స్ లో కనిపిస్తూ వచ్చారు వంశీ పైడిపల్లి. ఇంతకీ వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా ఏంటి.. అది ఎవరితో అన్నది ఆసక్తిగా ఉంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో వంశీ సినిమా ఉంటుందని ఒక న్యూస్ అయితే వచ్చింది కానీ అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్న క్లారిటీ రాలేదు.

వంశీ పైడిపల్లి సినిమా తీస్తే అది దిల్ రాజు బ్యానర్ లోనే అనే విధంగా ఎస్.వి.సీ బ్యానర్ తో ఆ కొలాబరేషన్ కొనసాగుతుంది. తొలి సినిమా మున్నా నుంచి మధ్యలో ఊపిరి ఒక్కటి బయట చేశాడు కానీ వంశీ పైడిపల్లి మిగతా సినిమాలన్నీ దిల్ రాజు నిర్మాణంలోనే చేశాడు. మరి దిల్ రాజుతోనే వంశీ నెక్స్ట్ సినిమా ఉండే ఛాన్స్ ఉండగా ఆ ప్రాజెక్ట్ ఏదో త్వరగా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఐతే ఈసారి వంశీ పైడిపల్లితో దిల్ రాజు ఒక పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ చేస్తాడని టాక్. ఐతే అందులో హీరో ఎవరన్నది మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News