• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక్కటి మాత్రమే అంటే ఎలా...

ఒక్కటి మాత్రమే అంటే ఎలా 'బ్రో'?

| మూవీ లో ఒకే ఒక యాక్షన్ సీన్ ఉందట. నిజానికి పవన్ మూవీ అంటే ఫ్యాన్స్ కచ్చితంగా ఫైట్ సీన్స్ ఉండాలని కోరుకుంటారు.

By - Tupaki Desk
Update: 2023-07-18 08:27 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా లో తొలిసారిగా మామ, అల్లుళ్లు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా కి బ్రో అనే టైటిల్ ని ఖరారు చేశారు. బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవన్ లుక్ ఫ్యాన్స్ కి మరింత ఎక్కువ కిక్ ఇచ్చింది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ తదితర పనులు జరుగుతున్నాయి.

పవన్ ని వింటేజ్ లుక్ లో ఎలా ఉంటాడా..? ఎప్పుడెప్పుడు పవన్ ని థియేటర్ లో చూస్తామా అని ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగు లోకి వచ్చింది. దాని ప్రకారం ఈ మూవీ లో పవన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ దాదాపు 20 నిమిషాలు ఎదురుచూడాలట. ఎందుకంటే, మూవీ మొదలైన 20 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా, మూవీ లో ఒకే ఒక యాక్షన్ సీన్ ఉందట. నిజానికి పవన్ మూవీ అంటే ఫ్యాన్స్ కచ్చితంగా ఫైట్ సీన్స్ ఉండాలని కోరుకుంటారు. అలాంటిది ఈ మూవీ లో కేవలం ఒక్కటే ఉంది అంటే అది అభిమానుల ను నిరాశ కలిగించే విషయమే.

అయితే, ఇప్పటి వరకు కేవలం యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి అనే రూల్ ఏమీ లేదు. అసలు ఎలాంటి ఫైట్ సీన్స్ లేకుండా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఉన్నాయి. ఇక, ఈ మూవీ లోనూ ఎమోషన్ సీన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఎమోషన్స్ నిజంగా క్లిక్ అయితే, యాక్షన్ సీన్స్ లేవు అనే భావన కూడా కలగదు. మరి ఈ విషయం లో డైరెక్టర్ సక్సెస్ అవుతాడో లేదో తెలియాలంటే విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, ఈ సినిమా కి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కి రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే, పవన్, తేజ్ ఈమేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేశారు ఈ మూవీ లో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    
  • BroMovie 
  • pawankalyan 
  • SaiDharamTej 
  • Samuthrikani 
  • KetikaSharma 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS