బన్నీ స్క్రిప్ట్ చరణ్ కాంపౌండ్ లో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.;

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెరపైకి వచ్చింది. చరణ్ తో సినిమా తీయమని సలహా ఇచ్చింది కూడా తానేనని ప్రచారంలో ఉంది. పవన్ తో సినిమా తీయడం ఎలాగూ ఆలస్యమవుతుంది? అంతవరకూ గ్యాప్ ఎందుకు అన్న కోణంలో చరణ్ ని సెట్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
దీంతో గురూజీ ఓ కొత్త కథతోనే చరణ్ ని అప్రోచ్ అయినట్లు తెలిసింది. కానీ అసలు సంగతేంటి? అంటే ఇది కొత్త కథ కాదు బన్నీ కోసం రాసిన స్క్రిప్ట్ నే గురూజీ వినిపించాడు? అన్నది తాజా అప్ డేట్. మెగా కాంపౌండ్ వర్గాల నుంచి ఈ సంగతి లీకైంది. వాస్తవానికి గురూజీ బన్నీతోనే సినిమా పట్టాలెక్కించాలి. ఆ ప్రాజెక్ట్ అధికారికంగానూ ప్రకటించారు. కానీ మధ్యలోకి అనూహ్యంగా అట్లీ రావడంతో? బన్నీ గురూజీని హోల్డ్ లో పెట్టాడు.
అట్లీ సినిమా అయిన తర్వాత మనం చేద్దామన్నాడు. దీంతో త్రివిక్రమ్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఈ గ్యాప్ లో గురూజీ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తాడనే ప్రచారం సాగింది. ఇది పక్కనబెడితే? అట్లీతో సినిమా తీయాలంటే ఎలాగైనా రెండేళ్ల సమయం పడుతుందన్న విషయం తెలియడంతో? గురూజీ మనసు మారిందన్నది తాజా సమాచారం. బన్నీ కోసం వెయిట్ చేయడం దేనికి అదే కథని రామ్ చరణ్ తో చేస్తే సరిపోతుందనే ఆలోచనకి వచ్చినట్లు తెలిసింది.
ఇదే స్టోరీని చరణ్ కి వినిపించినట్లు కాంపౌండ్ వర్గాల నుంచి లీకైంది. ఆర్సీ 17 చిత్రంతోనే దీన్ని కూడా మొదలు పెడదామని చరణ్ భరోసా ఇవ్వడంతోనే గురూజీ కూడా స్ట్రాంగ్ గా ముందుకెళ్లారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య చిన్న పాటి మనస్పర్దలున్నాయి. బన్నీ మామ మీడియా ముఖంగానే పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.` పుష్ప` రాజ్ పాత్ర విషయంలో తలెత్తిన వివాదం ఇది. అప్పటి నుంచి బన్నీ ఆ కుటుంబానికి దూరంగా ఉన్నట్లు ప్రచారంలో ఉండనే ఉంది.