స్టార్ హీరోయిన్ రేంజ్ ఇలా కూడా రెట్టింపే!
ఏ నటికైనా స్టార్‌డమ్ అనేది వారు చేసే సినిమాల విజయంపై ఆధారపడి ఉంటుంది. కానీ చెన్నై బ్యూటీ త్రిష విషయంలో మాత్రం తాజా పరిణామాలు ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.
ఏ నటికైనా స్టార్‌డమ్ అనేది వారు చేసే సినిమాల విజయంపై ఆధారపడి ఉంటుంది. కానీ చెన్నై బ్యూటీ త్రిష విషయంలో మాత్రం తాజా పరిణామాలు ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. గత కొంతకాలంగా త్రిష చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో `పొన్నియిన్ సెల్వన్` , `లియో` వంటి చిత్రాలతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె క్రేజ్ సినిమాలకు మించి రాజకీయ రంగు పులుముకోవడం విశేషం.ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకకు త్రిష హాజరుకావడం చర్చనీయాంశమైంది. కేవలం ఒక అతిథిగా మాత్రమే కాకుండా విజయ్ కుటుంబ సభ్యులతో ఆమె ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతూ కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ తల్లి శోభను త్రిష ఆత్మీయంగా హత్తుకున్న వీడియోలు వైరల్ కావడంతో ఆమె స్టార్‌డమ్ ఒక్కసారిగా రెట్టింపయ్యింది. విజయ్ , త్రిషల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. `గిల్లి` నుంచి `లియో` వరకు ఇద్దరు తిరుగులేని జోడీ. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను సృష్టించిన కాంబినేషన్ అది.
ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి రాష్ట్ర పగ్గాలు చేపట్టడంతో? ఆయనకు అత్యంత ఆప్తురాలిగా త్రిషకు లభిస్తున్న గౌరవం ఆమె ఇమేజ్‌ను మరింత పెంచింది. నెటిజన్లు సైతం త్రిషను రియల్ లైఫ్ క్వీన్ అంటూ కొనియాడుతున్నారు. ఏ నటికీ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవడం ఆమె డిమాండ్‌ను అమాంతం పెంచేసింది. సినిమా అవకాశాల విషయానికొస్తే? త్రిష ప్రస్తుతం సూర్య సరసన `కరుపు` , చిరంజీవి సరసన `విశ్వంభర` వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఈ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, విజయ్ రాజకీయ విజయంతో ఆమెకు వస్తోన్న పాపులారిటీ ఈ సినిమాల బిజినెస్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. నిర్మాతలు కూడా త్రిష ఉంటే సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఆమె పారితోషికం కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. అలాగే త్రిష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం తరుపున ఆమె ప్రచారానికి రావొచ్చు లేదా భవిష్యత్తులో ఏదైనా బాధ్యత తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలు త్రిషను నటిగానే కాకుండా పవర్‌ఫుల్ పర్సనాలిటీగా మార్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిషకు ఉన్న ఫాలోయింగ్ , ఆమెపై జరుగుతున్న చర్చ చూస్తుంటే? త్రిష రేంజ్ సినిమాలకు అతీతంగా మారుతోందని చెప్పొచ్చు.