ప్ర‌భాస్-హృతిక్.. యానిమ‌ల్ బ్యూటీ రేంజు?

యానిమ‌ల్ చిత్రంతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా ఆవిర్భ‌వించింది ట్రిప్తి దిమ్రీ.;

Update: 2025-07-16 03:58 GMT

యానిమ‌ల్ చిత్రంతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా ఆవిర్భ‌వించింది ట్రిప్తి దిమ్రీ. కేవ‌లం కొన్ని నిమిషాల పాటు క‌నిపించే పాత్ర‌లో న‌టించినా త‌న‌దైన ప్ర‌భావం చూపడంలో ట్రిప్తి పెద్ద స‌క్సెసైంది. ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఘాటైన రొమాన్స్ పండించే గ్లామ‌రస్ బ్యూటీగా యువ‌త‌రం హృద‌యాల‌ను దోచుకుంది.

ఈ సినిమాతో వ‌చ్చిన హైప్ కార‌ణంగా, ఆ త‌ర్వాత‌ పారితోషికాన్ని అమాంతం పెంచేసిన ట్రిప్తి, వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భాస్, హృతిక్, షాహిద్ క‌పూర్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌భాస్ స‌ర‌స‌న సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీలో ట్రిప్తికి అవ‌కాశం క‌ల్పించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ట్రిప్తికి అంత సీన్ ఉందా? ఆ రేంజ్ హీరోయినా? అంటూ కొంద‌రు విమ‌ర్శించారు. దీపిక ప‌దుకొనేతో వ్య‌వ‌హారం చెడిండి గ‌నుక‌నే వెంట‌నే ప్రెస్టేజ్ కోసం సందీప్ వంగా ట్రిప్తీని లైన్ లోకి తీసుకు వచ్చాడ‌ని భావించేవారు లేక‌పోలేదు.

అయితే ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత ట్రిప్తి హృతిక్ రోష‌న్ స‌ర‌స‌నా న‌టిస్తోంది అంటూ బాలీవుడ్ మీడియాలు క‌థ‌నాలు వండి వార్చాయి. ఇది కూడా షాకిచ్చే విష‌య‌మే. హృతిక్ `వార్ 2` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని, త‌దుప‌రి క్రిష్ 4 కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ట్రిప్తికి అవ‌కాశం అంటే అది కచ్ఛితంగా క్రిష్ 4లో ఛాన్సివ్వ‌డ‌మేన‌ని భావిస్తున్నారు. కానీ తాజాగా రిలీజైన వీడియో వివ‌రాల ప్ర‌కారం... హృతిక్- ట్రిప్తి జంట HRX కోసం జతకట్టారు. హృతిక్ రోష‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా విస్త‌రించిన సొంత లేబుల్ హెచ్ఆర్ఎక్స్ ఇప్ప‌టికే యువ‌త‌రంలో గొప్ప‌గా పాపుల‌రైంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న చిత్రీక‌ర‌ణ కోసం అని అర్థ‌మ‌వుతోంది.

హృతిక్ రోషన్ - ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ యాజమాన్యంలోని HRX, దుస్తులు, పాదరక్షలు, ఉపకరణాలు వంటి ఫిట్‌నెస్, జీవనశైలి ప్రొడ‌క్ట్స్ ని విక్ర‌యించే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్. 2013లో ప్రారంభ‌మైంది. ఈ బ్రాండ్ ఫిట్‌నెస్ గోల్స్ ని దృష్టిలో ఉంచుకుని రిలీజ్ చేయ‌గా, అది యువ‌త‌రాన్ని గొప్ప‌గా ఆక‌ర్షిస్తోంది.

త్రిప్తి దిమ్రి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించిన రొమాంటిక్ డ్రామా ధడక్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 1న‌ థియేటర్లలోకి రానుంది. షాహిద్ కపూర్ స‌ర‌స‌న‌ అర్జున్ ఉస్తారాలోను న‌టిస్తోంది. విశాల్ భ‌ర‌ద్వాజ్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Tags:    

Similar News