పూల్‌లో త్రిథా విరహం దేనికి సంకేతం
అందం- క్యూట్ నెస్ కేరాఫ్ ఎవరు? అంటే.. త్రిథా చౌదరి అని చెప్పాలి. క్యూటీ త్రిథా గురించి తెలుగు యువతకు పరిచయం అవసరం లేదు.;
అందం- క్యూట్ నెస్ కేరాఫ్ ఎవరు? అంటే.. త్రిథా చౌదరి అని చెప్పాలి. క్యూటీ త్రిథా గురించి తెలుగు యువతకు పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో యంగ్ హీరోల సరసన నటించిన త్రిథాకు తెలుగు నాట భారీగానే ఫాలోయింగ్ ఏర్పడింది. నిఖిల్ సరసన `సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో తెలుగు తెరకు వచ్చిన త్రిధా చౌదరి అటుపై `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ నటించింది. వరుసగా చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సెవెన్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి లాంటి చిత్రాలు త్రిథాకు నటిగా వరుస అవకాశాలు. ఈ బ్యూటీ స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో యూత్ కి కనెక్టయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో షంషేరా లాంటి భారీ చిత్రంలోనూ ఆఫర్ అందుకుంది.
ఇటీవల సోషల్ మీడియాల్లోను త్రిథా వేడెక్కించే ఫోటోషూట్లతో మైమరిపిస్తోంది.త్రిధా తాజా బికినీ షూట్ అంతే వైరల్ గా మారింది. త్రిథా ఇలా ఈత కొలనులో ఆదమరించి అయోమయంలో కనిపించింది. అలా కొలను అంచుపై ముఖాన్ని ఉంచి రిలాక్స్ డ్ మోడ్ లోను కనిపిస్తోంది. ముఖ్యంగా త్రిథా తన మేని విరుపులను మరోసారి బికినీలో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
త్రిథాకు ఇటీవల తెలుగులో ఆశించిన ఆఫర్లు లేవు. ప్రస్తుతం బూమరాంగ్ అనే బెంగాళీ చిత్రంలో నటిస్తోంది. త్రిధా అటు తమిళంలోనూ వరుస చిత్రాల్లో నటించేందుకు కథలు వింటోందని సమాచారం. మరోవైపు వరుసగా పలు వెబ్ సిరీస్ లలోనూ త్రిధా రెడీ అవుతోందిట. కానీ ఈ బ్యూటీకి పెద్ద స్థాయి ఆఫర్లు రాకపోవడం కెరీర్ పరంగా మైనస్ గా మారింది.