ఇరుముడి vs టాక్సిక్.. పరిస్థితి ఎలా ఉండబోతోంది?
‘ఇరుముడి’కి ఇప్పుడు అసలు బలం ఫ్యామిలీ ఆడియన్స్. సినిమా మొదటి రోజు నుంచే ఎమోషన్, రవితేజ పర్ఫామెన్స్, క్లైమాక్స్ గురించి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
‘ఇరుముడి’కి ఇప్పుడు అసలు బలం ఫ్యామిలీ ఆడియన్స్. సినిమా మొదటి రోజు నుంచే ఎమోషన్, రవితేజ పర్ఫామెన్స్, క్లైమాక్స్ గురించి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. రెండో రోజు కూడా బుకింగ్స్ పెరగడం, ఫ్యామిలీస్ షోలకి వస్తుండటం సినిమాకు లాంగ్ రన్ మీద నమ్మకం ఇచ్చింది. కానీ ఆగస్టు 26న ‘టాక్సిక్’ వస్తుండటంతో స్క్రీన్స్ దగ్గర కొత్త లెక్క మొదలవుతోంది.
ఇక్కడ రెండు సినిమాల మధ్య అసలు తేడా జానర్‌లోనే ఉంది. ‘టాక్సిక్’కు పూర్తి ‘A’ సర్టిఫికెట్. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ కూడా బోల్డ్, రా, యాక్షన్ టోన్‌లోనే ఉంది. యష్ క్రేజ్ వల్ల యూత్, మాస్ ఆడియన్స్ నుంచి ఓపెనింగ్ గట్టిగా రావచ్చు. కానీ ‘ఇరుముడి’ మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడగల సినిమా అనే టాక్ సంపాదించుకుంది. అందుకే ఒకటి వచ్చిందంటే ఇంకోటి పూర్తిగా ఖాళీ కావాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు.
అసలైతే పెద్ద స్టార్ సినిమా వస్తే ముందు నడుస్తున్న సినిమాలకు షోలు తగ్గడం తప్పదు. ‘టాక్సిక్’ కూడా భారీ రిలీజ్ కావడంతో మొదటి రెండు రోజులు ఎక్కువ స్క్రీన్స్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా యష్ సినిమాకే మారిపోతారని చెప్పలేం. ‘A’ సర్టిఫికెట్ వల్ల పిల్లలు, కుటుంబాలతో వెళ్లే ప్రేక్షకుల్లో ఒక వర్గం ‘ఇరుముడి’ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఇది ‘ఇరుముడి’కి ఒక రకంగా ప్లస్ కూడా కావచ్చు. మొదటి వీకెండ్ తర్వాత లెక్క ప్రకారం సినిమాకు షోలు తగ్గుతాయి. కానీ మరోవైపు వచ్చిన పెద్ద సినిమా పూర్తిగా వేరే ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తే, ఫ్యామిలీ షోలు మాత్రం నిలబడే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈవెనింగ్, వీకెండ్ షోలలో ‘ఇరుముడి’కి ఇంకా స్పేస్ దొరికితే రెండో వీకెండ్ కూడా బాగానే సాగొచ్చు.
అయితే యష్ క్రేజ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే గట్టిగా ఉన్నాయి. మొదటి రోజు నుంచి మంచి టాక్ పడితే యూత్ మాత్రమే కాదు, పెద్దలలో కూడా సినిమా చూడాలనే క్రేజ్ పెరుగుతుంది. అప్పుడు థియేటర్ యజమానులు షోలు ఎటు మార్చుతారన్నది రోజువారీ కలెక్షన్స్ మీదే ఉంటుంది. ‘ఇరుముడి’కి ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం ఒక్కటే సరిపోదు.. ఆక్యుపెన్సీ కూడా అలాగే కొనసాగాలి.
అందుకే ఈ క్లాష్ హీరోల మధ్య కంటే ఆడియన్స్ మీదే ఎక్కువగా కనిపిస్తోంది. ‘టాక్సిక్’కు యూత్, మాస్ ఓపెనింగ్ పెద్ద బలం. ‘ఇరుముడి’కి ఫ్యామిలీ రన్, మంచి టాక్ బలం. ఒకటి మొదటి మూడు రోజులు గట్టిగా దూసుకెళ్లొచ్చు. ఇంకోటి నెమ్మదిగా ఎక్కువ రోజులు నిలబడొచ్చు. చూడాలి మరి ఈ క్లాస్ లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్స్ వస్తాయో.