కియారా అద్వానీ అందాల సందడి.. టాక్సిక్ హైట్ పీక్స్!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్’.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్’. వచ్చే నెల 26న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. తాజాగా యష్, కియారా అద్వాణీలపై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. కియారా ఈ సాంగ్‌లోని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇన్‌స్టాలో కియారా క్రేజీ క్యాప్షన్:
ఈ రొమాంటిక్ సాంగ్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కియారా అద్వానీ పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. "నేను వెళ్లే ప్రతిచోటా కొంచెం అలజడిని సృష్టిస్తూ ఉంటాను" అంటూ క్రేజీగా రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటోల్లో కియారా తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో ప్రతి ఫ్రేమ్‌ను మరింత అందంగా మార్చేసింది.
అదిరిపోయిన కొత్త జోడీ కెమిస్ట్రీ:
ఇప్పుడు విడుదలైన వీడియో సాంగ్‌లో ప్రేమలో మునిగిపోయిన యశ్, కియారాలను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎంతో రొమాంటిక్‌గా చూపించారు. ఈ పాటలో వీరిద్దరి మధ్య కనిపించే ఐ కాంటాక్ట్, లవ్ మూమెంట్స్ అప్పుడే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇక తెరపై ఈ సరికొత్త జోడీ సూపర్ కెమిస్ట్రీని పండించిందని, థియేటర్లలో వీళ్ల రొమాన్స్ ఒక రేంజ్ లో ఉండబోతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
యష్ సరికొత్త లుక్.. పిల్లలకు నో ఎంట్రీ?:
ఈ సాంగ్ కాస్త ‘బోల్డ్’గా, పెద్దలకు మాత్రమే, పిల్లలు చూసేలా లేదు అన్నట్లుగా ఉండటం విశేషం. ఎందుకంటే ఇందులో యష్ కియారాల మధ్య అదిరిపోయే రొమాన్స్ తప్ప వేరే ఏమీ చూపించలేదు అన్నది కొందరి మాట.
నదియా పాత్రలో కియారా: 'టాక్సిక్:
ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కియారా అద్వాణీ 'నాడియా' అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల 'గేమ్ ఛేంజర్', 'వార్ 2' వంటి భారీ చిత్రాలతో మెప్పించిన కియారాకు.. ఈ పాన్-ఇండియా చిత్రం మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా లాంటి భారీ తారాగణం కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ రొమాంటిక్ సాంగ్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. కియారా షేర్ చేసిన ఈ హాట్ అండ్ క్లాసిక్ పిక్స్ చూస్తుంటే.. వచ్చే నెల థియేటర్లలో యష్‌తో కలిసి ఈ భామ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే అలజడి సృష్టించేలా కనిపిస్తోంది.