కాజల్ ఫ్యాన్స్‌కి షాక్ నా? సర్ప్రైజ్ నా? మండోదరి మాస్టర్ ప్లాన్ ఇదే!
కానీ ఒక స్టార్ నటిని సినిమాలోకి తీసుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం స్క్రీన్ టైమ్ మాత్రమే కాదని.. కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యమే కీలకమని గుర్తించాల్సిన అవసరం ఉంది.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరెకెక్కుతోనన ప్రతిష్ఠాత్మక `రామాయణం` ప్రాజెక్ట్‌లో చందమామ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో నటిస్తోందనే వార్త తొలి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇటీవల వెలువడుతున్న ప్రమోషనల్ కంటెంట్‌లో కాజల్ ఎక్కడా? కనిపించకపోవడంతో ఆమె పాత్రను తొలగించారా లేదా తగ్గించారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఒక స్టార్ నటిని సినిమాలోకి తీసుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం స్క్రీన్ టైమ్ మాత్రమే కాదని.. కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యమే కీలకమని గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఇతిహాస ఆధారిత సినిమాల్లో ప్రధాన పాత్రలతో పాటు సహాయ పాత్రల నిర్మాణంలో వైవిధ్యమైన శైలి కనిపిస్తుంది. సాధారణ వాణిజ్య చిత్రాల్లో పెద్ద నటి నటిస్తుందంటే ఆమెకు ఎక్కువ సన్నివేశాలు.. పాటలు ఉంటాయని ఆశిస్తారు. కానీ రామాయణం వంటి పౌరాణిక కథల్లో ప్రతి పాత్రకు దానికి కేటాయించిన నిర్దిష్ట సమయమే ఉంటుంది. రావణాసురుడి భార్యగా మండోదరి పాత్రకు కథాగమనంలో ప్రాముఖ్యత ఉంది. లంకలో పరిణామాలు, రావణుడి నిర్ణయాలు, సీతాపహరణం తర్వాత జరిగే అంతర్గత మథనాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన పాత్ర అది. మొదటి భాగంలో ఈ పాత్రకు ఎంత సమయం దక్కిందనే దానికంటే? లంక నేపథ్యాన్ని, రావణుడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో ఆమె పాత్ర ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందనేదే ముఖ్యం.
ఇక ప్రమోషన్లలో నటుడు కనిపించకపోవడాన్ని బట్టి ఆ పాత్ర తీసివేశారనో? ప్రాధాన్యం తగ్గించారనో? నిర్ధారించడం తొందరపాటే అవుతుంది. మేకర్స్ అనుసరించే ప్రచార వ్యూహాల్లో కొన్ని పాత్రలను సస్పెన్స్‌గా ఉంచడం ఒక భాగం. కథలో కీలక మలుపులను .. పాత్రల రూపకల్పనను ముందే బహిర్గతం చేయకుండా సీక్రెట్‌గా ఉంచేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో లారా దత్తా .. ఇతర నటీనటుల విషయంలో జరిగిన ప్రచారంతో పోల్చి చూస్తూ కాజల్ పాత్రపై నిర్ణయానికి రావడం సరికాదు. చిత్రబృందం అధికారికంగా వెల్లడించే వరకు ఊహాగానాలకు బదులు నిర్మాణ వ్యూహంగా చూడటం సరైన పద్ధతి.
`రామాయణం` రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పాత్రల విభాగాన్ని వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ఉండే అవకాశం ఉంది. లంక నేపథ్యం, రావణుడి పాత్ర తీవ్రత, యుద్ధ ఘట్టాలు ఎక్కువగా రెండో భాగంలోనే ఊపందుకుంటాయి. కాబట్టి మొదటి భాగంలో మండోదరి పాత్ర పరిచయానికే పరిమితమై రెండో భాగంలో కథను ముందుకు నడిపే శక్తివంతమైన సన్నివేశాలతో రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఒక నటిగా కాజల్ ఇమేజ్ను మొదటి భాగం ప్రమోషన్ల ఆధారంగా అంచనా వేయడం కంటే? రెండు భాగాల విస్తృతిలో ఆమె పాత్ర ప్రాధాన్యతను చూడాల్సి ఉంటుంది.
నిజానికి ఈ చర్చలన్నింటికీ కారణం ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలే. కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ ఒక ప్రాజెక్ట్‌లోకి వచ్చిందంటే ఆమెకు తగిన రీతిలోనే స్క్రీన్ స్పేస్ ఉంటుందని భావిస్తారు. అయితే అధికారిక సమాచారం లేని చోట గాసిప్స్ పుట్టుకురావడం సహజం. ప్రమోషన్ల ద్వారా ప్రేక్షకులు పొందే సంకేతాలు, అధికారిక అప్డేట్స్ లేకపోవడం వల్ల కలిగే గందరగోళం... సినిమాలపై ఊహాగానాలను మరింత పెంచుతాయి.
సమగ్రంగా పరిశీలిస్తే కాజల్ అగర్వాల్ `రామాయణం`లో చేసేది చిన్న పాత్ర అయినా? అది కథా నిర్మాణంలో కీలకమైన మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఇమేజ్‌తో పనిలేకుండా కథకు అవసరమైన రీతిలో పాత్రను తీర్చిదిద్ది ఉంటే తక్కువ స్క్రీన్ టైమ్‌లోనే కాజల్ నటనతో చెరగని ముద్ర వేసే అవకాశం ఉంటుంది. రూమర్లకు అతీతంగా వెండితెరపై మండోదరిగా కాజల్ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడటానికి విడుదల వరకు వేచి చూడాల్సిందే.