తేజ సజ్జాకు బాలీవుడ్ గాడ్ ఫాదర్ సపోర్ట్.. అసలు కథేంటి?
తేజ సజ్జా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్‌తో పాటు మంచి పరిచయాలు కూడా అవసరమని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్‌కు కొంతమంది ప్రముఖ నిర్మాతలు.. అండగా నిలుస్తారనే చర్చ ఎప్పటి నుంచో ఐ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అలాంటి వారిలో కరణ్ జోహార్ పేరు ముందుగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న.. తేజ సజ్జాకు కరణ్ జోహార్ సపోర్ట్ ఇవ్వడం ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
తేజ సజ్జా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తన నటన, కథల ఎంపికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇప్పుడు తేజ సజ్జా మరో కొత్త బాధ్యత తీసుకున్నారు. ప్రముఖ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
బాలీవుడ్‌లో కరణ్ జోహార్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు.. రియాలిటీ షోలకు కూడా మంచి హోస్ట్‌గా గుర్తింపు పొందారు. ది ట్రైటర్స్ హిందీ వెర్షన్‌కు ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ గేమ్‌లో మోసాలు, వ్యూహాలు, అనూహ్య మలుపులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇప్పుడు అదే కార్యక్రమానికి తెలుగు వెర్షన్‌లో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో కరణ్ జోహార్ ఆయనకు మద్దతుగా నిలిచారు. తేజకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను ప్రోత్సహించడం రెండు భాషల కార్యక్రమాల మధ్య ఆసక్తికరమైన అనుబంధాన్ని చూపిస్తోంది.
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్‌కు కరణ్ జోహార్ అండగా ఉంటారనే విమర్శలు గతంలో చాలాసార్లు వినిపించాయి. కంగనా రనౌత్ కూడా ఈ అంశంపై బహిరంగంగా విమర్శలు చేశారు. అయితే తేజ సజ్జా విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాకపోయినా తన ప్రతిభతో ఎదిగిన తేజకు ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ వ్యక్తి నుంచి ప్రోత్సాహం లభించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
'ది ట్రైటర్స్' తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ షోతో తేజ సజ్జా హోస్ట్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.