• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బజ్ పెరిగితే దిల్ రాజు...

బజ్ పెరిగితే దిల్ రాజు జాక్ పాట్

| బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం యానిమల్.

By - Tupaki Desk
Update: 2023-09-26 04:51 GMT

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం యానిమల్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ కూడా మరో వైపు క్లోజ్ చేసేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ ఉండటం ఉండటం వలన తెలుగులో కూడా యానిమల్ కి క్రేజ్ ఉంది. దానికి కారణం సందీప్ రెడ్డి, రష్మిక మందన అని చెప్పొచ్చు.

అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి తెలుగులో రిలీజ్ కాబోతోనున్న సినిమా ఇదే కావడంతో ఆ హైప్ ఉంది. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ హక్కులని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. 15 కోట్లకి అన్ని భాషలకి సంబందించిన తెలుగు రాష్ట్రాల రైట్స్ ని ఆయన దక్కించుకున్నారు. సినిమా బడ్జెట్ పరంగా ఇది పెద్ద ఎమౌంట్ కాకపోయిన తెలుగులో రణబీర్ కపూర్ మార్కెట్ లెక్కలు వేసుకుంటే మంచి రేటుకె కొనుగోలు చేసినట్లు లెక్క.

ఈ సినిమాపై ఇప్పటి వరకు పాజిటివ్ బజ్ ఉంది. సందీప్ రెడ్డి వంగా టీజర్, ట్రైలర్స్ తో మూవీపై అంచనాలు పెంచగలిగితే కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే దిల్ రాజు జాక్ పాట్ కొట్టినట్లే అని చెప్పొచ్చు. ఇప్పటికే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ జాక్ పాట్ కొట్టిన దిల్ రాజుకి యానిమల్ కూడా ప్లస్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

రణబీర్ కపూర్ కూడా కెరియర్ లో మొదటిసారి కంప్లీట్ యాక్షన్ ఫ్లేవర్ లో సౌత్ ఇండియన్ స్టైల్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అయిన రక్తపాతం ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తోందని పోస్టర్స్ బట్టి అర్ధమవుతోంది.

Tags:    
  • Dilraju 
  • Producer 
  • Tollywood 
  • Movienews 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS