దుబాయ్ సేటుతో ప్రేమలో తెలుగు హీరోయిన్? త్వరలోనే పెళ్లి?

దుబాయ్ యూట్యూబర్‌ తో ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఇప్పుడు సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-12-09 10:15 GMT

దుబాయ్ యూట్యూబర్‌ తో ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఇప్పుడు సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎవరితో రిలేషన్ లో ఉంది? ఓ సారి తెలుసుకుందాం.

ఆమె ఎవరో కాదు.. సునయన.. ఆ పేరు వింటే వెంటనే బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన గుర్తొచ్చింది కదా.. కానీ ఆమె కాదు.. మరొక బ్యూటీ. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన సునయన ఎల్లా.. చదువు తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సినిమాలపై మక్కువతో అవకాశాల కోసం ట్రై చేశారు.

2005లో కుమార్ vs కుమార్ అనే మూవీతో టాలీవుడ్ లోకి డెబ్యూ ఇచ్చిన సునయన.. ఆ తర్వాత టెన్త్ క్లాస్, సంథింగ్ స్పెషల్, పగలే వెన్నెల వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ అనుకున్న స్థాయిలో హిట్స్ తో పాటు క్రేజ్ ను సంపాదించుకోలేకపోయారు. దీంతో సౌత్ లో మిగతా భాషల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరుస సినిమాలు చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సునయన.. మళ్లీ తెలుగులోకి వచ్చారు. రీసెంట్ గా కుబేర మూవీలో కింగ్ నాగార్జున భార్యగా నటించారు. హోమ్లీ లుక్‌‌ లో కనిపించి.. సినిమాలో తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

దుబాయ్‌ కు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఖలీద్ అల్ అమేరీ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరికీ సీక్రెట్‌ గా ఎంగేజ్మెంట్ జరిగిందని గాసిప్స్ వినిపించాయి. చేతికి ఉంగరంతో ఉన్న ఫోటోలు ఆ మధ్య నెట్టింట వైరల్ కావడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లైంది.

అయితే ఇప్పుడు త్వరలోనే సునయన పెళ్లి పీటలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. రెండ్రోజుల క్రితం ఖలీద్ తన బర్త్ డేను సునయనతో కలిసి జరుపుకున్నారు. హోటల్‌ లో సునయన చేతిలో చేయి వేసి పట్టుకున్న పిక్ ను పోస్ట్ చేశారు. అంతే కాదు.. థాంక్స్ ఫర్ ది బ్యూటిఫుల్ బర్త్ డే అంటూ క్యాప్షన్ గా ఖలీద్ ఇవ్వడం గమనార్హం.

సునయన కూడా తన ఇన్‌ స్టాగ్రామ్ లో ఖలీద్ బర్త్ డే కేక్ ను కట్ చేసిన పిక్ ను షేర్ చేశారు. దీంతో వారిద్దరి రిలేషన్ నిజమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతేడాది ఎంగేజ్మెంట్ జరిగిన విషయం కూడా నిజమేలా ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఖలీద్ కు సాల్మా అనే మహిళతో వివాహం జరిగి విడాకులు అయినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News