లుక్కు కిక్కి ఇచ్చేలా.. రీసౌండ్ అదిరిపోయేలా..!

ఇక మరోపక్క దేవర కోసం ఎన్టీఆర్ మాస్ లుక్ ఫ్యాన్స్ ని అలరించింది. దేవర ముంగిట నువ్వెంత అంటూ మాస్ యాటిట్యూడ్ తో తారక్ అదరగొట్టాడు.;

Update: 2025-04-02 22:30 GMT

టాలీవుడ్ స్టార్ సినిమా లెక్క మారింది. మన బడా హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా సినిమాల కోసం మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా ఎంచుకున్న కథ కోసం వారి లుక్కు విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఒకప్పుడు లుక్కు విషయంలో పెద్దగా పట్టించుకోని స్టార్స్ ఇప్పుడు కథకు తగినట్టుగా రఫ్ లుక్ తో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య హీరోలంతా కూడా రగ్డ్ లుక్ తో షేక్ చేస్తున్నారు.

పాత్రలను బట్టే హీరోల లుక్కు ఉంటుంది. ఐతే ఈమధ్య మన హీరోలంతా కూడా అదే తరహా పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా చేస్తున్న సినిమాలన్నీ కూడా క్యారెక్టరైజేషన్ కి తగినట్టుగా లుక్కు సెట్ చేసుకున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ లుక్కు బాగా ఎక్కేసింది. ఇక క్యారెక్టరైజేషన్ కి తగినట్టుగా అల్లు అర్జున్ నటన నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

ఇక మరోపక్క దేవర కోసం ఎన్టీఆర్ మాస్ లుక్ ఫ్యాన్స్ ని అలరించింది. దేవర ముంగిట నువ్వెంత అంటూ మాస్ యాటిట్యూడ్ తో తారక్ అదరగొట్టాడు. సలార్ సినిమాలో ప్రభాస్ కూడా మాస్ పాత్రలో సీరియస్ లుక్ తో సత్తా చాటాడు. ఇలా పాత్రలకు తగినట్టుగా లుక్కు సెటప్ అంతా మార్చేస్తున్నారు స్టార్స్.

రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమాలో కూడా మహేష్ లుక్కు కూడా మాస్ గా ఉండబోతుందని తెలిసిందే. 28 సినిమాల్లో మహేష్ ఇదివరకు ఎప్పుడు చేయని విధంగా తన మాస్ లుక్ తో అలరిస్తున్నాడు. తప్పకుండా ఈ లుక్కుతో మహేష్ అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఇవే కాదు రాబోతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా తారక్ మాస్ లుక్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుందని తెలుస్తుంది.

ఇదే క్రమంలో రామ్ చరణ్ పెద్దిగా మాస్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న పెద్దిలో చరణ్ ఊర మాస్ లుక్కు మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.

సినిమా కథ కథనాలు ఏమో కానీ ఫ్యాన్స్ ఊగిపోయేలా క్యారెక్టరైజేషన్ తో పూనకాలు తెప్పించేలా స్టార్స్ తమ మాస్ వైబ్స్ తో అదరగొట్టేస్తున్నారు. తప్పకుండా ఈ మాస్ ట్రీట్ ఫ్యాన్స్ కి స్పెషల్ క్రేజ్ తెస్తాయని చెప్పొచ్చు. లుక్క్తో అదరగొట్టడమే కాదు రికార్డుల రీ సౌండ్ తో దుమ్ము దులపే పనిలో నిమగ్నమై ఉన్నారు మన స్టార్స్.

Tags:    

Similar News