• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్.. ఇక అప్డేట్స్...

టాలీవుడ్.. ఇక అప్డేట్స్ జాతరే..

| టాలీవుడ్ లు ప్రస్తుతం చాలా సినిమాలు ఆన్ సెట్స్ పైన ఉన్నాయి. అలాగే కొన్ని మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-09-01 05:30 GMT

టాలీవుడ్ లు ప్రస్తుతం చాలా సినిమాలు ఆన్ సెట్స్ పైన ఉన్నాయి. అలాగే కొన్ని మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకం అని చెప్పాలి. ఆడియన్స్ కూడా ఈ సినిమాల అప్డేట్స్ గురించి క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. టైర్ 1, టైర్ 2 హీరోల నుంచి రాబోతున్న సినిమాలే వీటిలో మెజారిటీగా ఉన్నాయి.

కచ్చితంగా 2024 ద్వితీయార్ధం, 2025 ప్రథమార్ధం టాలీవుడ్ నుంచి ఇంటరెస్టింగ్ మూవీస్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. నందమూరి బాలయ్య, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న NBK109 మూవీ టైటిల్ రివీల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కింగ్ నాగార్జున త్వరలోనే కొత్త సినిమాతో రావాలని అనుకుంటున్నారు. త్వరలో ఆ సినిమాకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చని సమాచారం.

అలాగే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్, వీలైతే టైటిల్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఓజీ మూవీ స్ట్రాంగ్ అప్డేట్ రానుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అదే రోజు వస్తాయి.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ మూవీ SSMB29 ఎనౌన్స్ మెంట్ మరో రెండు నెలల్లో రావొచ్చంట. డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ రాజాసాబ్ మూవీ గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో వరుస అప్డేట్స్ రానున్నాయి.

మరికొన్ని రోజుల్లో ఆయుధ పూజ సాంగ్ రానుంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప ది రూల్ టీజర్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్, విజయ్ దేవరకొండ VD12 ఫస్ట్ లుక్ గ్లింప్స్, నాని న్యూ ప్రాజెక్టుపై ఎనౌన్స్ మెంట్, నాగ చైతన్య తండేల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్, రాబిన్ హుడ్ ఫస్ట్ సింగి, అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ కూడా రావాల్సి ఉంది.

Tags:    
  • Tollywood 
  • Pawankalyan 
  • Ogmovie 
  • NBK109 
  • Balakrishna 
  • SSMB29 
  • Maheshbabu 
  • Vijaydeverakonda 
  • VD12 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS