ఆ హీరోకు ఒక్కరు కాదు.. ముగ్గురు డూప్స్.. ఏంటి నిజమేనా?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు డూప్స్ ఉంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-06-04 08:57 GMT

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు డూప్స్ ఉంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కొందరు హీరోల సినిమాల్లో వాళ్ళు ముఖ్యపాత్ర పోషిస్తారని గుసగుసలు వినిపిస్తుంటాయి. మరికొందరు కథానాయకులు మాత్రం.. ఏ సీన్ అయినా.. ఏదైనా స్వయంగా వాళ్లే నటిస్తుంటారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంటోంది.

అయితే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోకు ఒక డూప్ ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన సినిమాల్లో ఆ డూప్ కచ్చితంగా వర్క్ చేయాల్సిందే. చాలా మంది హీరోల డూప్స్ మూవీస్ లోని యాక్షన్స్ సీన్స్ కు ఎక్కువగా పరిమితమవుతుంటారు. ఆ సమయంలో హీరోలు తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు.

కానీ సదరు హీరో డూప్.. యాక్షన్ సీన్స్ కే కాదు.. అన్నీ చేస్తుంటారు. అటు డ్యాన్సులు.. ఇటు లాంగ్ షాట్స్ లో సదరు హీరో సినిమాల్లో వర్క్ చేస్తుంటారు. అది కూడా ఆయన మన తెలుగు వ్యక్తే. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవారు. కానీ ఇప్పుడు అంతకుమించి లగ్జరీ లైఫ్ తో ఫుల్ గా చిల్ అవుతున్నారట.

సదరు టాలీవుడ్ హీరోకు డూప్ గా ఉండడం.. ఆయనకు బాగా కలిసొచ్చింది! సాలిడ్ గా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు టాలీవుడ్ హీరోకు ఒకరు కాదట.. ఇప్పుడు ముగ్గురు డూప్స్ ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీంతో అందరూ షాక్ అవుతున్నారు. అవునా.. నిజమా.. ముగ్గురు డూప్సా అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి.. సదరు హీరో ఇప్పుడు తనకు సంబంధించిన ఇతర వర్క్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఫిట్ నెస్ కూడా అప్పటిలా లేదని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. లుక్ లో ఛేంజ్ వచ్చిందని గుసగుసలు వస్తున్నాయి.

అందుకే ఇప్పుడు ముగ్గురు డూప్స్ తో ఆయన సినిమాల షూటింగ్ జరుగుతుందోనని.. జరిగిందని.. ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి సదరు హీరో.. తన ముగ్గురు డూప్స్ పైనే ఫుల్ గా డిపెండ్ అయ్యారని టాక్.ఇది నిజమో కాదో తెలియకపోయినా.. ఇప్పుడు సినీ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారిన విషయం నిజమే.

Tags:    

Similar News