ఆస్కార్ రేసులో ఇండియా నుంచి ఈ సినిమా.. అవార్డు దక్కేనా?
కథ విషయానికి వస్తే.. ఇది మనసును పిండేసే స్టోరీ. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కూలీలు పడ్డ కష్టాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి.;
RRR మ్యాజిక్ తర్వాత ఆస్కార్ అంటే మనోళ్లకు క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఆ గోల్డెన్ లేడీని మరోసారి ఇండియాకు తెచ్చే సత్తా ఉన్న సినిమాగా 'హోమ్‌బౌండ్' నిలిచింది. నీరజ్ ఘైవాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 2026 ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అకాడమీ ఈ సినిమాను షార్ట్ లిస్ట్ చేయడం నిజంగా స్పెషల్ మూమెంట్. కరణ్ జోహార్ లాంటి వాళ్లు కూడా దీనిపై ట్వీట్ చేయడంతో బజ్ పెరిగింది.
అసలు కాంపిటీషన్ చూస్తే మామూలుగా లేదు. పాన్ ఇండియా సెన్సేషన్ 'పుష్ప 2', భారీ బడ్జెట్ మూవీ 'కన్నప్ప', నాగార్జున 'కుబేరా', 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి పెద్ద సినిమాలు ఈ రేసులో ఉన్నాయని టాక్ వినిపించింది. కానీ వాటన్నింటినీ దాటుకుని, కంటెంట్ ఉన్న చిన్న సినిమాగా 'హోమ్‌బౌండ్' జ్యూరీ మనసు గెలుచుకుంది. కమర్షియల్ హంగులు లేకపోయినా, కథలో దమ్ముంటే ఆస్కార్ వరకు వెళ్లొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
కథ విషయానికి వస్తే.. ఇది మనసును పిండేసే స్టోరీ. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కూలీలు పడ్డ కష్టాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. అవే కష్టాలను బేస్ చేసుకుని ఈ సినిమాను తీశారు. చందన్, షోయిబ్ అనే ఇద్దరు స్నేహితులు తమ సొంత ఊరికి వెళ్ళడానికి పడే పాట్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. పేదరికంతో పాటు కులం, మతం అనే అడ్డుగోడలు మనుషుల మధ్య ఎలాంటి దూరాన్ని పెంచుతాయో ఇందులో చాలా రియలిస్టిక్ గా చూపించారు.
జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. రెగ్యులర్ గ్లామర్ పాత్రలు కాకుండా, డీ గ్లామర్ లుక్ లో జాన్వీ నటన ఆశ్చర్యపరుస్తుంది. సామాజిక అసమానతల మధ్య నలిగిపోయే పాత్రల్లో వీళ్ళు జీవించారని చెప్పాలి. అందుకే ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ కూడా ఈ ఎమోషనల్ జర్నీకి కనెక్ట్ అయ్యారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయడంతో ఆడియెన్స్ కు ఈజీగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా చూడాలనుకునే వాళ్లకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఆల్రెడీ 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కానీ హిందీలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేయొచ్చు. సినిమాలోని ఎమోషన్ కు భాష అడ్డురాదు కాబట్టి, ఒక మంచి హార్ట్ టచింగ్ సినిమా చూడాలనుకునే వాళ్లు కచ్చితంగా ట్రై చేయొచ్చు.
ప్రస్తుతానికి షార్ట్ లిస్ట్ లో చోటు దక్కింది. ఫైనల్ నామినేషన్ల లిస్ట్ 2026 జనవరి 22న రాబోతోంది. అక్కడ కూడా సెలెక్ట్ అయితే, మార్చి 15న జరిగే అవార్డుల వేడుకలో ఇండియా జెండా ఎగిరే ఛాన్స్ ఉంది. మరి మన 'హోమ్‌బౌండ్' ఆస్కార్ వేదికపై మెరుస్తుందో లేదో చూడాలి.