కేఆర్కే నోటికి తాళం.. సీరియస్ వార్నింగ్!
అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. తన పరువు తీసినందుకు కేఆర్కే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్మాత కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం ఇప్పుడే ఆ ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరించింది.;
సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అంటే కమల్ రషీద్ ఖాన్ KRK. సినిమా రివ్యూల పేరుతో, వ్యక్తిగత విమర్శలతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం ఈయనకు అలవాటు. కానీ ఈసారి ఆయనే చట్టం ముందు అడ్డంగా దొరికిపోయారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాషు భగ్నానీ వేసిన పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టు కేఆర్కేకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు నిర్మాత వాషు భగ్నానీ గురించి నోరు జారకూడదని కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
అసలు గొడవ ఏంటంటే.. 2021లో కేఆర్కే తన సోషల్ మీడియాలో వాషు భగ్నానీ మీద, ఆయన సినిమాల మీద వరస పెట్టి పోస్టులు పెట్టాడు. అవి కేవలం విమర్శల్లా కాకుండా, తన పరువు తీసేలా ఉన్నాయని, తన ప్రైవసీకి భంగం కలిగించాయని వాషు భగ్నానీ కోర్టు మెట్లు ఎక్కారు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసినందుకు కేఆర్కేపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
లేటెస్ట్ గా ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ మీద ఒక వ్యక్తి ఇమేజ్ ను దెబ్బతీయడం సీరియస్ విషయమని జడ్జిలు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ కేసు ఫైనల్ గా తేలేవరకు వాషు భగ్నానీకి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టకూడదని, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకూడదని కేఆర్కేను ఆదేశించారు.
అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. తన పరువు తీసినందుకు కేఆర్కే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్మాత కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం ఇప్పుడే ఆ ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరించింది. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి, ఫైనల్ హియరింగ్ సమయంలో కేఆర్కే సారీ చెప్పాలా వద్దా అనేది డిసైడ్ చేస్తామని చెప్పింది.
మామూలుగా అయితే కేఆర్కే ఎవరికీ భయపడడు, స్టార్ హీరోలను కూడా వదలడు. కానీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ కాబట్టి సైలెంట్ గా ఉండక తప్పదు. ఇది కేవలం వాషు భగ్నానీ ఒక్కరి విజయమే కాదు, సెలబ్రిటీల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడే మిగతా క్రిటిక్స్ కు కూడా ఇదొక హెచ్చరిక లాంటిదే. మరి ఫ్యూచర్ లో ఫైనల్ తీర్పు ఎలా వస్తుందో చూడాలి.