దారుణమైన స్టేజ్ లో టాలీవుడ్.. క్వాలిటీ పడిపోయింది: దిల్ రాజు

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు.;

Update: 2025-07-06 11:30 GMT
దారుణమైన స్టేజ్ లో టాలీవుడ్.. క్వాలిటీ పడిపోయింది: దిల్ రాజు

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చుని సినిమాలు చూడాలనేలా ఆడియన్స్ ను తామే అలవాటు చేశామని అన్నారు. ఓటీటీలు ఇచ్చిన డబ్బులకు చిత్రాలు ఇచ్చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా దారుణమైన స్టేజ్ లో ఉంది. ఈ ఏడాదిలో ఆరు నెలలు పూర్తయ్యాయి. ఆరు సినిమాలు కూడా ఆడలేని పరిస్థితులు ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరు చిత్రాలు అద్భుతంగా ఆడే పరిస్థితులు లేవ్. అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది" అని దిల్ రాజు తెలిపారు.

"ఆ తర్వాత కోర్ట్ మూవీ.. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. మరో నాలుగు సినిమాలు హిట్స్ అయ్యాయి. మే 9 నుంచి కుబేర వచ్చేవరకు ఆరు వారాల వరకు సమ్మర్ వెకేషన్ లో ఆడియన్స్ చూసేందుకు సినిమాలు లేవ్. దీంతో ఆ ఆరు వారాల పాటు అనేక థియేటర్స్ ను క్లోజ్ చేసుకున్నారు" అని చెప్పారు.

"ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడాలి. అది ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకుని మార్చుకుందామని ముందుకు రావడం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ఐదు కారణాలు ఉన్నాయి. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటీటీ అనే ప్రభావంతో మేమే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఓటీటీలకు సినిమాలు ఇచ్చేశాం" అని పేర్కొన్నారు.

"ఇంట్లో కూర్చుని సినిమాలు చూడాలని ఆడియన్స్ ను అలవాటు చేశాం. అదే మొదటి కారణం. ఆ తర్వాత రెండోది.. కోవిడ్ కంటే ముందు 2020 సంక్రాంతికి వచ్చిన అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ సంక్రాంతికి వచ్చిన రెవెన్యూ మళ్లీ ఇప్పటి వరకు రాలేదు" అని వెల్లడించారు.

"కోవిడ్ తర్వాత చాలా మార్పు వచ్చింది. ఫుట్ పాల్ తగ్గుతూ వస్తోంది. 50 శాతం తగ్గింది. ప్రేక్షకులు రావడం లేదు. దానికి ఫస్ట్ స్టెప్ మేమే. థియేటర్స్ ను రప్పిద్దామంటే టికెట్ రేట్లు పెంచుతున్నాం. క్యాంటిన్ రేట్లు పెంచుతున్నాం. మెయింటెనెన్స్ లో థియేటర్స్ లేవ్. అందుకు ఇన్వెస్ట్ చేయలేరు" అని తెలిపారు.

"మూడో కారణం.. వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమాలు ఓటీటీలో చూడొచ్చు. ఆడియన్స్ థియేటర్స్ కు రావడానికి ఏం కంటెంట్ ఇస్తున్నాం? కోవిడ్ తర్వాత ప్రతి ప్రొడక్షన్ హౌస్ సినిమాల సంఖ్య పెంచింది. కానీ క్వాలిటీ పడిపోయింది. ఆడియన్స్ కు నచ్చేలా తీయడం లేదు. ప్రతి వారం మంచి సినిమాలు ఇవ్వలేకపోవడం, ఎగ్జైట్మెంట్ లేకుండా చేయడం కూడా కారణాలే" అని దిల్ రాజు తెలిపారు.

Tags:    

Similar News