పవన్ చెప్పుల గురించి ఏం చర్చ... !
పవన్ కళ్యాణ్ వేసుకుని ఉన్న ఆ చెప్పుల ధర దాదాపుగా రూ.30,000 లుగా తెలుస్తోంది.;
పవన్ కళ్యాణ్ ఏం చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీ అధినేతగా ఏదైనా మీటింగ్‌లో పాల్గొన్నా కూడా మొత్తం ఆయన వైపు తిరిగి చూసుకునేలా చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాతో రాబోతున్నాడు అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు, అందరూ హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లుక్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. అంతే కాకుండా ఆయన ధరించిన చెప్పుల గురించి కూడా చర్చ మొదలైంది.
పవన్ కళ్యాణ్ వేసుకున్న చెప్పులు...
ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేసుకున్న చెప్పుల గురించి అభిమానులు మాత్రమే కాకుండా సోషల్ మీడియా జనాలు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. ఆ చెప్పులకు సంబంధించిన విషయాలను తెలియజేయాలంటూ గూగుల్ లేదా ఏఐ ప్లాట్ ఫామ్స్‌ను అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ వేసుకుని ఉన్న ఆ చెప్పుల ధర దాదాపుగా రూ.30,000 లుగా తెలుస్తోంది. ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ కాసారే పాసియోట్టి వారు ఈ చెప్పులను తయారు చేయడం జరిగిందని ఆన్ లైన్ లో సమాచారం లభిస్తోంది. ఆ చెప్పులపై కత్తి ఆకారంలో ఉన్న ఒక మెటల్‌ను పెట్టడం ద్వారా మరింత స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ అంటూ ఉంటాడు, మరి అలాంటి వ్యక్తి ఇంత ఖరీదైన చెప్పులు వేయడం అవసరమా అంటూ కొందరు ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు.
అత్తారింటికి దారేది సినిమా టైంలో...
పవన్ కళ్యాణ్ చెప్పుల గురించి షూ గురించి చర్చ జరగడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. అత్తారింటికి దారేది సినిమా అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ వేసుకునే చెప్పుల గురించి చర్చ మొదలైంది. ఖరీదైన బ్రాండ్స్‌ను వినియోగిస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి అప్పటి నుంచే చర్చ సాగింది. పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్ రూ.30 వేల ఖరీదు చేసే చెప్పులు వేయడంను అతి అనడం విడ్డూరంగా ఉందని ఆయన అభిమానులు కొందరు అంటున్నారు. ఒక్క సినిమాకు కోటాను కోట్ల పారితోషికం తీసుకునే పవన్ కళ్యాణ్ ఆ మాత్రం ఖరీదైన చెప్పులు ధరించడంలో తప్పేం లేదు అనేది వారి అభిప్రాయం. కొత్త హీరోలు, చిన్న హీరోలు సైతం బ్రాండ్ అంటూ లక్షలు ఖరీదు చేసే ఔట్ ఫిట్ ను ధరిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ స్థాయికి ఆ చెప్పులు ఎలా ఎక్కువ అవుతాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ చెప్పుల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్...
హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కేవలం 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసినట్లుగా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. తక్కువ సమయంలో మంచి సినిమా చేసినట్లుగా కూడా చెప్పాడు. ఇలా స్పీడ్‌గా సినిమాలు చేసే దర్శకులు వస్తే తప్పకుండా మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ప్రత్యేక పాటతో పాటు, చిన్న పాత్రలో రాశి ఖన్నా కనిపించబోతుంది. ఓజీ, వీరమల్లు సినిమాల తర్వాత పవన్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, అందుకు తగ్గట్లుగానే భారీ ఎత్తున ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.250 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో ఉస్తాద్ రాబోతున్నాడు. మరి అంత సాధ్యమేనా చూడాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.