పోక్సో చట్టంపై టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్!
ఓ మైనర్ బాలికపై కృష్ణ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాలిక ఫ్యామిలీ కంప్లైంట్ చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.;
టాలీవుడ్ లో తెర వెనుక పనిచేసే వారు చేస్తున్న పనుల వల్ల ఇండస్ట్రీకి పేరు ప్రతిష్టలు తగ్గిపోతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న కృష్ణ ఇప్పుడు చట్టపరమైన ఆరోపణల నేపథ్యంలో అరెస్టయ్యారు. తాజా సమాచారం ప్రకారం అతనిపై జులైలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
మైనర్ బాలికతో అసభ్యకర ప్రవర్తన
ఓ మైనర్ బాలికపై కృష్ణ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాలిక ఫ్యామిలీ కంప్లైంట్ చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లాడని, చాలా వారాల వరకు అతని జాడ కూడా తెలియకుండా దాక్కున్నాడని, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతను బెంగుళూరు వెళ్లి అక్కడే ఉండిపోయాడని, ఎట్టకేలకు కృష్ణను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
ఇదే మొదటి సారి కాదు
అయితే కృష్ణ ఇలా వివాదంలో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలువురు యువతులను మోసం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేశాడని ఆరోపణలొచ్చాయి కానీ ఆ టైమ్ లో అతనిపై ఎలాంటి కేసులు నమోదైంది లేదు. అయితే ఇప్పుడు తాజాగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో ఆయనపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ విషయం తెలుగు మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెంగుళూరులో కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నందున రాబోయే రోజుల్లో దీనిపై మరింత సమాచారంతో పాటూ మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలున్నాయి.