పెద్దాయన ది బెస్ట్ కోసం ఇంకా శ్రమించాలి!
పాటలతో పాటు అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మాస్టర్ ఎవరంటే? ఒకప్పుడు రెహమాన్ పేరు వినిపించేది.;
పాటలతో పాటు అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మాస్టర్ ఎవరంటే? ఒకప్పుడు రెహమాన్ పేరు వినిపించేది. ఇప్పుడాయన వేవ్ కాస్త తగ్గింది. మునుపటిలా ఏ చిత్రంలోనూ రెహమాన్ మార్క్ పడటం లేదు. కొత్తగా ప్రయత్నిస్తున్నారనే మాట తప్ప! అందులో కిక్ దొరకడం లేదు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా `పెద్ది`కి పని చేయడంతో ఎలాంటి మ్యాజిక్ అందిస్తారు? అన్న అంచనాలైతే అందరిలో ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగీత మాంత్రికులు ఎవరు? అంటే అనిరుద్ రవిచంద్రన్, రవి బస్రూర్, అజనీష్ లోక్ నాధ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సంగీత త్రయంతో తిరుగులేదు:
ఈ ముగ్గురు ఆర్ ఆర్ తోనే సినిమాను పైకి లేపుతున్న సంగీత త్రయంగా గుర్తింపు దక్కించుకున్నారు. కథ ఎలా ఉన్నా? ఆర్ ఆర్ లో తమదైన మార్క్ వేస్తున్నారు. రోటీన్ కథని సైతం అమాంతం ఆర్ ఆర్ తో పైకి లేపుతున్నారు. సినిమాలో పాటలకన్నా? నేపథ్య సంగీతం అత్యంత కీలకంగా మారింది. మూడు నాలుగు నిమిషాల పాటకన్నా బ్యాక్ గ్రౌండ్ లో వస్తోన్న స్కోర్ ఎలా ఉంది? అని ప్రేక్షకులు చర్చించుకునే స్థాయికి ఆర్ ఆర్ రీచ్ అయింది. అందుకు తగ్గట్టు నయా మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. థమన్ కూడా మంచి ఆర్ ఆర్ ఇస్తాడని పేరుంది.
ఆ రెండు సినిమాలను మించి:
అలాగే దేవి శ్రీ ప్రసాద్ కూడా మంచి స్కోర్ అందిస్తాడు. `పుష్ప` లాంటి సినిమాకు పాటలతో పాటు ఆర్ ఆర్ కూడా మంచి సపోర్ట్ గా నిలిచింది. కానీ ఈ విషయంలో సీనియర్ సంచలనం కీరవాణి మాత్రమే కాస్త మెరుగుపడాలి? అన్న చర్చ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది. గత సినిమాలు `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి పాన్ ఇండియా సినిమాలకు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కిక్ లేదనే చిన్న విమర్శ ఉంది. పాటల వరకూ ఒకే గానీ.. ఆర్ ఆర్ లో ఊపు కనిపించలేదు. ఏమంత గొప్ప ఎగ్జైట్ మెంట్ ని తీసుకు రాలేదు.
ఆస్కార్ గుర్తింపుతో రెట్టించిన ఉత్సాహం:
ఈ నేపథ్యంలో `వారణాసి` విషయంలో అలాంటి నెగిటివిటీకి తావు ఇవ్వకుండా ది బెస్ట్ ఆర్ ఆర్ ఇవ్వాలని మహేష్ అభిమానులు కోరుతున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే అంతర్జాతీయంగానూ ఆయన మ్యూజిక్ కనెక్ట్ అవ్వాలి. `నాటు నాటు `పాటకు అస్కార్ అవార్డు సైతం అందుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈనేపథ్యంలో `వారణాసి`కి సంగీతం అందించడం అంటే ఓ రకంగా ఆయనపైనా ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఆర్ ఆర్ లో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే? ది బెస్ట్ ఔట్ పుట్ కు ఆస్కారం ఉంది.