పిక్‌టాక్‌ : టెన్నిస్ రాకెట్‌ పట్టిన ముద్దుగుమ్మ

ఈమధ్య కాలంలో తెలుగు సోషల్‌ మీడియాలో దేవియాని శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.;

Update: 2025-04-10 20:30 GMT

ఈమధ్య కాలంలో తెలుగు సోషల్‌ మీడియాలో దేవియాని శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈమె సేవ్‌ ది టైగర్స్‌లో నటించడం ద్వారా ఒక్కసారిగా పాపుతారిటీని సొంతం చేసుకుంది. అంతకు ముందు ఈమె పలు సినిమాల్లో, సిరీస్‌ల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు సేవ్ ది టైగర్స్ వెబ్‌ సిరీస్‌తో దక్కించుకుంది. మొదటి సీజన్‌లో నటనతో ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత అందంతో అలరించింది. తక్కువ సమయంలోనే సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో వరుస ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తోంది. త్వరలోనే ఈమె మరో సినిమా, సిరీస్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.


సేవ్ ది టైగర్స్ వెబ్‌ సిరీస్‌లో శ్రీమతి పాత్రలో కనిపించి పద్దతి అయిన ఔట్ ఫిట్‌లో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలు మాత్రం హీట్‌ పెంచే విధంగా ఉంటాయి. వెబ్‌ సిరీస్‌లో చూసిన దానికి, ఈమె షేర్ చేసే ఫోటోలకు చాలా భిన్నంగా ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈమె ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈమె స్కిన్‌ షో ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో దేవియాని శర్మకు దాదాపు రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వరుసగా ఈమె షేర్‌ చేస్తున్న అందమైన ఫోటోల కారణంగా, సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచే విధంగా ఈమె షేర్‌ చేస్తున్న పోటోల కారణంగా మరింత వైరల్‌ అవుతూ వస్తోంది. విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ ధరించడం ద్వారా ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె అందమైన ఫోటోలను షేర్ చేసింది. తాజా ఫోటోల్లో టెన్నిస్ రాకెట్‌ చేతిలో పట్టి, పొట్టి స్కర్ట్‌ ధరించి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. నడుము అందం చూపిస్తూ కవ్వించే చూపులతో దేవియాని శర్మ స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అన్నట్లుగా కామెంట్స్ దక్కించుకుంటుంది.


ఇంత అందంగా ఉన్న దేవియాని శర్మకు పెద్దగా ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో చాలా మందితో పోల్చితే దేవియాని శర్మ చాలా అందంగా ఉంది అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో దేవియాని శర్మ ఇదే స్థాయిలో అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఈమె కచ్చితంగా మంచి గుర్తింపు దక్కించుకోవడం మాత్రమే కాకుండా నటిగానూ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్‌ వారు అంటున్నారు.

Tags:    

Similar News