టిల్లు క్యూబ్.. అంతా గుంటూరు కారం మహిమే..

టిల్లు గాడి హంగామాకి ఈ సారి కాస్తా మసాలా జోడించారు.

Update: 2024-05-05 04:46 GMT

సితార ఎంటర్టైన్మెంట్ తో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీని మార్చి 29న థియేటర్స్ లోకి రాగా అది కూడా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. టిల్లు గాడి హంగామాకి ఈ సారి కాస్తా మసాలా జోడించారు.

అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ టిల్లు స్క్వేర్ కి ఎక్స్ ట్రా ఎస్సెట్ అయ్యింది. దీంతో యూత్ కి ఈ మూవీ విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. ఈ సినిమాకి పోటీగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏవీ కూడా లేకపోవడంతో ఓవరాల్ గా 132 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. చిన్న హీరోలలో 100 కోట్ల క్లబ్ లో చేరిన నటుడిగా సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ కి అనుబంధంగా ఉన్న హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లో ఈ ఏడాది గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చాలా ప్రాంతాలలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. అయితే టిల్లు స్క్వేర్ మూవీ గుంటూరు కారంతో వచ్చిన నష్టాలని పూడ్చిందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇక టిల్లు వెంచర్ కి యూత్ నుంచి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో సిరీస్ ని కొనసాగించాలని సితార ఎంటర్టైన్మెంట్ డిసైడ్ అయ్యింది. టిల్లు క్యూబ్ మూవీ ఉంటుందని కన్ఫర్మ్ చేసేశారు.

Read more!

అలాగే మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా కోసం ఆమెకి అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా పూజాని తప్పించారు. అది కాస్త ఆమె కెరీర్ పై కాస్త ఇంపాక్ట్ అయితే చూపించింది. చేయి దాకా వచ్చిన అవకాశాలను కూడా ఆమె మిస్ చేసుకుంది. ఆ కారణంగానే ఇప్పుడు టిల్లు క్యూబ్ కోసం పూజా హెగ్డేని రంగంలోకి దించుతున్నారని సమాచారం.

అయితే టిల్లు క్యూబ్ కోసం ఈ సారి సరికొత్త ఎలిమెంట్ ని టచ్ చేయబోతున్నారంట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది మ్యాడ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ని తెరకెక్కించనున్నారంట. రామ్ మిరియాల ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ కూడా టిల్లు క్యూబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారంట. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లానింగ్ లో నిర్మాత నాగవంశీ ఉన్నారు.

ఈ సారి టిల్లు హంగామాని ట్రిపుల్ చేసి ఫన్ రైడ్ గా కథని చూపించాలని అనుకుంటున్నారంట. బడ్జెట్ కూడా 50 కోట్లకి పైగానే ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ స్కేల్ పై ఈ సారి ఫారిన్ బ్యాక్ డ్రాప్ ని టిల్లు క్యూబ్ లో టచ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ హంగామా ఈ పార్ట్ 3లో ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

Tags:    

Similar News