ఆయనకు రూ.5 కోట్లు, ఆమెకు రూ.10 లక్షలు

ఒకప్పుడు టీవీ షో లను టీవీ ఆర్టిస్టులను చిన్నచూపు చూసేవారు. సినిమా వారికి మాత్రమే స్టార్‌ హోదా ఉండేది

Update: 2024-05-02 08:30 GMT

ఒకప్పుడు టీవీ షో లను టీవీ ఆర్టిస్టులను చిన్నచూపు చూసేవారు. సినిమా వారికి మాత్రమే స్టార్‌ హోదా ఉండేది. సినిమా ఇండస్ట్రీలోని వారు టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని చులకనగా చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ ఎంతగా ఎదిగిందో మనం చూస్తున్నాం.

టీవీల్లో కనిపించే కొందరు నటీనటులు మరియు యాంకర్స్ కి సినిమాల హీరో హీరోయిన్స్ కంటే కూడా అధిక రెమ్యూనరేషన్ దక్కుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బుల్లి తెరపై దూసుకు పోతున్న స్టార్‌ కపిల్‌ శర్మ. సినిమాల ద్వారా నటుడిగా దక్కిన గుర్తింపు మరియు పారితోషికం కంటే ఇప్పుడు టీవీ రంగంలో ఆయనకు దక్కిన గుర్తింపు, వస్తున్న పారితోషికం ఎన్నో రెట్లు ఎక్కువ.

కామెడీ నైట్స్ విత్‌ కపిల్‌ షో తో పాటు ఇంకా ఎన్నో కామెడీ షో లను హోస్ట్‌ గా, జడ్జ్ గా, మెంటర్‌ గా వ్యవహరించి నడిపించిన కపిల్‌ శర్మ ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ కోసం గ్రేట్ ఇండియన్‌ కపిల్‌ షో ను చేస్తున్నాడు. ఈ షో కోసం కపిల్‌ శర్మ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

కపిల్‌ శర్మ 'గ్రేట్‌ ఇండియన్ కపిల్‌ షో' ఒకొక్క ఎపిసోడ్‌ కి గాను కోసం ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం ను తీసుకుంటున్నాడు. సల్మాన్‌ బిగ్‌ బాస్‌ హోస్ట్‌ గా అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆయన పక్కన కపిల్ శర్మ నిలవడం విశేషం.

Read more!

కపిల్‌ శర్మ నెట్‌ ఫ్లిక్స్ కోసం గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో ను 15 నుంచి 20 ఎపిసోడ్స్ వరకు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ హిట్‌ అయితే ముందు ముందు మరిన్ని సీజన్ లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. తదుపరి సీజన్ లకు కపిల్‌ మరింత పారితోషికం పెంచినా ఆశ్చర్యం లేదు.

గ్రేట్‌ ఇండియన్ కపిల్‌ షో లో హోస్ట్‌ గా వ్యవహిస్తున్న కపిల్‌ శర్మ కి ఒక్కో ఎపిసోడ్‌ కి రూ.5 కోట్ల పారితోషికం ఇస్తుండగా... అదే షో లో కనిపించే గెస్ట్‌ జడ్జ్ నటి అర్చన సింగ్ కు ఒక్కో ఎపిసోడ్‌ కి రూ.10 లక్షల పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి స్టార్‌ హీరోల స్థాయిలో కపిల్‌ శర్మ టైం నడుస్తోంది.

Tags:    

Similar News