• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గోద్రా ఘటనపై 'ది సబర్మతి...

గోద్రా ఘటనపై 'ది సబర్మతి రిపోర్ట్‌'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

| ఇప్పటికే మూవీని నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-07 04:24 GMT

బాలీవుడ్ న‌టుడు, 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే.. ప్రస్తుతం ది సబర్మతీ రిపోర్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రంజన్‌ చందేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో రాశీ ఖన్నా, రిద్ది డోగ్రా హీరోయిన్లు గా నటిస్తున్నారు. గోద్రా దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీని నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

కొద్ది రోజుల క్రితం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన జ‌రిగిన గోద్రా ఘ‌టన చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. డేరింగ్ జర్నలిస్ట్ గా విక్రాంత్ నటిస్తున్నట్లు, రాశీ ఖన్నా తోటి రిపోర్టర్‌ గా, సీనియర్ యాంకర్‌ గా రిద్ధి యాక్ట్ చేస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు టీజర్ కు వచ్చిన స్పందనతో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ లో విక్రాంత్ మెస్సే సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ పై జరిగిన దాడి వెనుక నిజాన్ని వెలికితేసేందుకు పోరాడుతున్నట్లు చూపించారు మేకర్స్. ఆంగ్ల కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో పోరాడుతూ కనిపించారు. పోలీసులు తీసుకెళ్తుంటే పవర్ ఫుల్ డైలాగ్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు విక్రాంత్. ట్రైలర్ చివర్లో రైలుపై దాడి జరుగుతున్నట్లు, ట్రైన్ తగలబడుతున్నట్లు చూపించే సన్నివేశాలు.. ఒక్కసారిగా సినిమాపై ఆస్తకి రేపాయి.

సినిమాలో క్యాస్టింగ్ అంతా పవర్ ఫుల్ గా నటించినట్లు ట్రైలర్ ద్వారా క్లియర్ గా అర్థమవుతోంది. విక్రాంత్ మస్సే, రిద్ధి డోగ్రా అదరగొట్టేశారు. 12th ఫెయిల్, ది సబర్మతి రిపోర్ట్ చిత్రాల్లో విక్రాంత్ పోషించిన రోల్స్ మధ్య చాలా పోలికలు ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. రెండు పాత్రల్లో విక్రాంత్ ఒదిగిపోయారని అంటున్నారు. కానీ రెండు రోల్స్ సెపరేట్ జోనర్ అని రీసెంట్ గా ఆయన క్లారిటీ ఇచ్చారు.

అదే సమయంలో రాశీ ఖన్నా యాక్టింగ్ కూడా అదిరిపోయిందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ బాగుందని రివ్యూ ఇస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయని అంటున్నారు. అయితే నిజజీవిత సంఘటనలు, వివాదాలపై ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ద కశ్మీర్ ఫైల్స్, ద కేరళ స్టోరీ చిత్రాలు అలాంటివే అని చెప్పవచ్చు. ఆ సమయంలో కాంట్రవర్సీలు జరిగాయి. మరి ఇప్పుడు సబర్మతీ రిపోర్ట్ మూవీ విషయంలో ఏమవుతుందో చూడాలి.

VIKRANT MASSEY: 'THE SABARMATI REPORT' TRAILER OUT NOW... 15 NOV RELEASE... Ahead of its theatrical release on 15 Nov 2024, the makers of #TheSabarmatiReport unveil the hard-hitting trailer that is sure to spark conversations.

The film - headlined by #VikrantMassey - also… pic.twitter.com/dnMgs8sAin

— taran adarsh (@taran_adarsh) November 6, 2024
Tags:    
  • Bollywood 
  • Filmindustry 
  • TheSabarmatiExpress 
  • Trailer 
  • TrailerOut 
  • VikrantMassey 
  • RaashiKhanna 
  • RiddhiDogra 
  • RanjanChandel 
  • EktaKapoor 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS