తమన్ 'రాజా సాబ్'.. ఏం నడుస్తోంది?

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాకు తమన్ బాణీలు కట్టారు. ఆ మూవీ పాటల విషయంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు

Update: 2024-05-01 04:55 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 2009లో కిక్ మూవీతో ఒక్కసారి ఫేమస్ అయ్యారు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు తమన్.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాకు తమన్ బాణీలు కట్టారు. ఆ మూవీ పాటల విషయంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ట్యూన్స్ కాపీ చేశారంటూ ఫుల్ ట్రోల్ చేశారు నెటిజన్లు. చెప్పాలంటే ఆయన మ్యూజిక్ అందించిన చాలా పాటలకు నెగిటివ్ ట్రోల్సే ఎక్కువగా వస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి 'జరగండి' లిరికల్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయింది. ఆ పాట ట్యూన్ కూడా కాపీనే అంటూ కామెంట్స్ వచ్చాయి.

ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం తమన్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. హీరోహీరోయిన్ల మధ్య మారుతి ఓ సాంగ్ ను షూట్ చేసినట్లు వార్తలు వినిపించాయి.

ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేసిన తమన్.. మిగతా సాంగ్స్ పై వర్క్ చేస్తున్నారట. నార్మల్ గా తన పాటలను హైదరాబాద్ లేదా దుబాయ్ లేదా యూరప్ కంట్రీల్లో కంపోజ్ చేస్తారు తమన్. కానీ ఇప్పుడు రాజా సాబ్ మిగతా మ్యూజిక్ వర్క్ ను మహాబలిపురం, పాండిచ్చేరిలో పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో తమన్ అక్కడికి ఎందుకు వెళ్లారోనని నెట్టింట అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లేదంటే తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడేమో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Read more!

అయితే రాజా సాబ్ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి ముగ్గురికి హీరోతో ఒక్కొక్క స్పెషల్ పాట ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ మూడు స్పెషల్ సాంగ్స్ కు సినిమాలో మంచి స్కోప్ ఉందని కూడా సమాచారం. మరి ఈ మూవీలోని పాటలకు తమన్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తున్నారో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News